బాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫ్యామిలీ కపూర్‌లది. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి వచ్చారు. వారిలో నటుడిగా అనిల్ కపూర్ గొప్ప స్థాయిని అందుకుంటే.. ఆయన సోదరుడు బోనీ కపూర్ నిర్మాతగా పెద్ద రేంజికి ఎదిగాడు. ఈ అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధమే ఉంది. ఐతే బోనీ తీయబోయే కొత్త సినిమాలో అనిల్ కపూర్ ఛాన్స్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేదట. దీంతో అనిల్ అలిగాడట. ఈ విషయాన్ని బోనీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2
005లో విడుదలైన నో ఎంట్రీ మూవీ అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇందులో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, బిపాసా బసు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి బోనీ రెడీ అయ్యాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను సెట్స్ మీదికి వెళ్లబోతోంది. నో ఎంట్రీ వచ్చిన 20 ఏళ్లకు, అంటే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే నో ఎంట్రీ సీక్వెల్ రాబోతోందని తెలిసి.. తాను కూడా అందులో నటిస్తానని అనిల్ కపూర్ ముందుకు వచ్చాడట. ఐతే ఈ సినిమాలో నిన్ను తీసుకోవడానికి ఖాళీ లేదని తేల్చి చెప్పేశాడట బోనీ కపూర్. దీంతో అనిల్ కపూర్ అలిగాడట. తాను ఈ విషయంలో సర్దిచెబుదామని అనిల్‌కు కాల్ చేస్తుంటే అతను స్పందించట్లేదని మీడియాకు వెల్లడించాడు బోనీ.
ఇక ఈ చిత్రంలో తన కొడుకు అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ హీరోలుగా నటిస్తున్నట్లు వెల్లడించాడు బోనీ. ఇందులో పదిమంది హీరోయిన్లు నటిస్తారని బోనీ చెప్పడం విశేషం.
This post was last modified on March 31, 2024 7:44 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…