థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం.. థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం అంటూ వచ్చిన ‘వి’ సినిమాను చివరికి ఓటీటీలోకి వదిలేశారు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడి థియేటర్లు తెరుచుకునే, మామూలుగా నడిచే అవకాశం లేకపోవడంతో మంచి డీల్ వచ్చేసరికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కాదనలేకపోయాడు. ఈ వరుసలో మరికొన్ని పేరున్న సినిమాలు కూడా ఇలాగే నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజాగా ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ అయింది. ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న ‘ఆహా’లోనే ‘కలర్ ఫోటో’ కూడా వస్తుందంటున్నారు. ఇవి కాక సోలో బ్రతుకే సో బెటర్, నిశ్శబ్దం, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా కూడా లైన్లో ఉన్నాయి. ఐతే వీటన్నింటితో పోలిస్తే కొంచెం ఎక్కువ రేంజ్, క్రేజ్ ఉన్న సినిమా ఒకటి ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే.. లవ్ స్టోరి.
బ్లాక్ బస్టర్ మూవీ ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం.. లవ్ స్టోరి. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. కరోనా వల్ల ఆలస్యమైంది. ఇటీవలే అన్ని జాగ్రత్తలతో షూటింగ్ పున:ప్రారంభించారు.
సింగిల్ షెడ్యూల్లో మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెలాఖరుకల్లా సినిమా పూర్తయిపోతుందట. ఈ చిత్రానికి ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రూ.30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఐతే దీని నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాకు ఇదే తొలి చిత్రం. వాళ్లకు పెద్ద సంఖ్యలో థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. పేరున్న సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడం పట్ల ఎగ్జిబిటర్లలో వ్యతిరేకత కనిపిస్తోంది.
తమిళనాట అయితే ఈ విషయంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. అలాంటిది ఇక్కడ పేరున్న ఎగ్జిబిటర్ తమ సినిమాను ఓటీటీల్లో రిలీజ్ చేస్తే ఆ వర్గాల్లో వ్యతిరేకత రావడం ఖాయం. తమ వ్యవస్థను తామే ఇబ్బందుల్లోకి నెట్టినట్లవుతుంది. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరి’ని ఓటీటీకి ఇస్తారా లేదా అన్నది సందేహమే.
This post was last modified on September 14, 2020 3:50 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…