మొత్తానికి టాలీవుడ్లో వేసవి సందడి మొదలైపోయింది. గత వారం వచ్చిన ‘ఓం భీం బుష్’తోనే జోష్ వస్తుందని అనుకున్నారు కానీ.. అది అనుకున్న స్థాయిలో సౌండ్ చేయలేదు. కానీ ఈ వారం వచ్చిన క్రేజీ మూవీ ‘టిల్లు స్క్వేర్’ అంచనాలకు ఏమాత్రం తగ్గకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర హడావుడి మామూలుగా లేదు. తొలి రోజు ఉదయం 7 గంటల నుంచే టిల్లుగాని సందడి మొదలైపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. యుఎస్‌లో సైతం ‘టిల్లు స్క్వేర్’ హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. ప్రతి చోటా వసూళ్ల మోత మోగిస్తోందీ చిత్రం. తొలి రోజు నిర్మాత నాగవంశీ అన్నట్లు రూ.25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. నిర్మాత చెప్పిందానికి దగ్గర్లోనే వసూళ్లు ఉన్నాయన్నది ట్రేడ్ వర్గాల మాట. వీకెండ్ అంతా ‘టిల్లు స్క్వేర్’ జోరు కొనసాగబోతోంది. ఇక సినిమా చూసిన వాళ్లందరూ ఇందులోని డైలాగుల గురించే మాట్లాడుకుంటున్నారు.
ఐతే ‘డీజే టిల్లు’తో పాటు ‘టిల్లు స్క్వేర్’కూ హీరో సిద్ధు జొన్నలగడ్డే రైటర్ అని అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాకు అతనొక్కడే రచయిత కాదు. టిల్లు పాత్రను ఇంత బాగా తీర్చిదిద్దడంలో.. ట్రెండీ డైలాగ్స్ రాయడంలో అతడికి ఇంకో హ్యాండ్ సాయపడింది. ఆ రైటర్ పేరు.. రవి ఆంటోనీ. ఈ పేరు జనాలు పెద్దగా విని ఉండరు. కానీ ఆ ‘మ్యాడ్’ సినిమా చూసిన వాళ్లంతా ఆ రైటర్‌ను నటుడిగా చూసి ఎంజాయ్ చేసిన విషయం తెలియదు.
అందులో ఆంటోనీ అనే పాత్రలో ట్యూబ్ లైట్ పట్టుకుని తిరుగుతుంటాడు ఓ నటుడు. సినిమాలో బాగా పేలిన.. మంచి వినోదం పంచిన పాత్రల్లో అదొకటి. ఆ పాత్రలో చేసిన నటుడే రవి ఆంటోనీ. అతనే సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘డీజే టిల్లు’ స్క్రిప్టు రాశాడు. ఇప్పుడు ఆ సినిమాను మించి ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు-రవి జోడీ పంచులు పేల్చింది. ఈ సినిమాతో వీళ్లిద్దరికీ రచయితలుగా ఇంకా పేరు వచ్చిన నేపథ్యంలో ‘టిల్లు-3’కి వీరిపై అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on March 30, 2024 5:13 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…