సూపర్ హీరోలు, రాకాసి ప్రాణుల హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో క్రేజ్ ఎక్కువ. అందులోనూ కింగ్ కాంగ్, గాడ్జిల్లాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. విడివిడిగానే ఇవి చేసే విన్యాసాల కోసం అభిమానులు ఎగబడతారు. అలాంటిది రెండు కలిసి స్క్రీన్ మీద చేయబోయే విధ్వంసం ఊహలకు అందుతుందా. అందుకే ఈ కంబైన్డ్ ఫ్రాంచైజ్ మొదలైనప్పటి నుంచి నిర్మాణ సంస్థకు వేల కోట్లు కురిపించే కామధేనువుగా మారిపోయింది. నిన్న గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ భారీ అంచనాల మధ్య నూతన సామ్రాజ్యం పేరుతో తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎవరికీ కనిపించని పాతాళం లాంటి లోతైన హాలో ఎర్త్ లో కాంగ్ నివాసం ఉంటుంది. భూమి మీదకు దాడి చేసే టైటాన్స్ ని కాచుకుంటూ గాడ్జిల్లా ఖాళీ సమయంలో నిద్రపోతూ ఉంటుంది. వీటి మీద పరిశోధనలు చేసే మోనార్క్ సంస్థ డాక్టర్, ఆమె కూతురికి గ్రావిటీ (గురుత్వాకర్షణ) కు సంబంధించిన కొన్ని ప్రమాదరకమైన సంకేతాలు అందుతాయి. మానవాళి ప్రమాదంలో ఉందని గుర్తించి కాపాడమని అడిగేందుకు ఒక టీమ్ హాలో ఎర్త్ కు వెళ్తుంది. రాకాసి కోతులు, జలచరాలతో భయంకరంగా ఉన్న ఆ సమూహం నుంచి మనుషులను కాంగ్, గాడ్జిల్లాలు ఎలా కాపాడారనేది అసలు కథ.
విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే కష్టం కానీ కాంగ్, గాడ్జిలా ఫ్యాన్స్ ని ఈ కొత్త సీక్వెల్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఘటాన్ని అబ్బురపరిచే రీతిలో చిత్రీకరించాడు దర్శకుడు ఆడం విన్ గార్డ్. కేవలం రెండు గంటల లోపే నిడివితో స్క్రీన్ ప్లేని నడిపించడంతో బోర్ కొట్టే అవకాశం పెద్దగా ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మరీ తీవ్రంగా అయితే లేదు. మెయిన్ విలన్ టైటాన్ ని ఆశించిన స్థాయిలో డిజైన్ చేయకపోవడం, ముందు భాగాల మాదిరి కాకుండా ఇందులో ఎమోషన్ ని వదిలేయడం మైనసయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసమైనా చూడాల్సిన సినిమాగా రికమండ్ చేసేలానే ఉంది.
This post was last modified on March 30, 2024 10:31 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…