టాలీవుడ్ వేసవి వినోదం టిల్లు స్క్వేర్ మూవీతో మొదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. టిల్లు పాత్ర మరోసారి పండడం.. అందులో సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫామెన్స్ అదిరిపోవడం.. డైలాగులు టపాసుల్లా పేలడంతో టిల్లు స్క్వేర్ థియేటర్లలో కోలాహలం కనిపిస్తోంది. కథ కొంచెం వీక్ అయినా.. లాజిక్కులు కొండెక్కేసినా.. ఎంటర్టైన్మెంట్‌కు ఢోకా లేకపోవడం టిల్లు స్క్వేర్‌కు ప్లస్ అయింది. పైసా వసూల్ అనిపిస్తున్న సినిమాతో మెజారిటీ ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. ఐతే సినిమా ఆఖర్లో ప్రేక్షకులు కోరుకున్న మెరుపు లేకపోవడం మాత్రం కొంత నిరాశను మిగిల్చింది.
ఇంతగా క్లిక్ అయిన టిల్లు పాత్రను ఇక్కడితో ఆపేయకుండా సిద్ధు టిల్లు-3 కూడా చేస్తాడని.. దాని గురించి రెండో భాగం చివర్లో హింట్ కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ లేకుండా ఈ కథను ముగించి రోలింగ్ టైటిల్స్ వేసేశారు. దీంతో టిల్లు-3 ఉండదేమో అని ప్రేక్షకులు భావించారు.
కానీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్లలో టిల్లు స్క్వేర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అసలు విషయం చెప్పాడు. టిల్లు-3 ఉంటుందని.. దాని గురించి హింట్ సినిమాలో పెట్టడం కుదరలేదని వెల్లడించాడు. వీకెండ్ అయ్యాక సినిమాలో ఆ బిట్ యాడ్ చేస్తామని.. సోమవారం నుంచి మూడో పార్ట్ గురించి కొసమెరుపు ఉంటుందని చెప్పాడు. ఇది టిల్లు అభిమానులకు మంచి ఉత్సాహాన్నిచ్చే వార్తే. కాగా తొలి రోజు టిల్లు స్క్వేర్‌కు రూ.25 కోట్ల మేర గ్రాస్ వస్తుందని అంచనా అని.. ఫుల్ రన్లో ఈ సినిమా వంద కోట్ల మార్కును అందుకుంటుందని వంశీ ధీమా వ్యక్తం చేయడం విశేషం.
This post was last modified on March 30, 2024 8:40 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…