Movie News

రీరిలీజ్‌ల వైభవం ముగిసిందా?

ఒక ఏడాది పాటు టాలీవుడ్లో రీరిలీజ్‌ల హంగామా న‌డిచింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ల పాత సినిమాలు అభిమానులను ఒక ఊపు ఊపేశాయి. కొత్త సినిమాలు కూడా వెలవెలబోయేలా పాత చిత్రాలు వసూళ్ల మోత మోగించడం ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్. అనువాద చిత్రాలు, పైగా ఫస్ట్ రిలీజ్ టైంలో సరిగా ఆడని సూర్య సన్నాఫ్ కృష్ణన్, 3 లాంటి మూవీస్‌కు కూడా హౌస్ ఫుల్స్ పడటం మామూలు విషయం కాదు.

ఐతే అతి సర్వత్ర వర్జయేత్ అనే ఒక సామెత ప్రకారమే.. ఈ రీరిలీజ్‌ల సంఖ్య మరీ ఎక్కువ అయిపోవడం.. సరైన ప్లానింగ్ లేకపోవడం ఈ ట్రెండ్‌ను దెబ్బ కొట్టింది. గత కొన్ని నెలల్లో వచ్చిన రీ రిలీజ్‌లు ఏవీ పెద్దగా ప్రభావం చూపలేదు. రాను రాను ప్రేక్షకుల్లో వీటి పట్ల ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఫలితమే.. పాత సినిమాల రీ రిలీజ్ రైట్స్ కొన్న వాళ్లకు చేదు అనుభవం.

కాగా ఇప్పుడు రెండు పేరున్న పాత సినిమాలు రీ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ అయిన మగధీర. ఇంకోటి బాలయ్య కెరీర్లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘లెజెండ్’. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘మగధీర’ను బుధవారమే రిలీజ్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్‌లోని ఒకట్రెండు మెయిన్ థియేటర్లలో తప్ప రెస్పాన్స్ లేదు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి హడావుడి కనిపించడం లేదు. మెగా ఫ్యాన్సే ‘మగధీర’ రీ రిలీజ్‌ను పెద్దగా ఓన్ చేసుకున్నట్లు కనిపించడం లేదు.

నిజానికి గతంలో వసూళ్ల మోత మోగించిన చాలా రీ రిలీజ్‌లతో పోలిస్తే.. ‘మగధీర’కు ఎక్కువ క్రేజ్ ఉండాలి. వసూళ్లు కూడా భారీగా రావాలి. కానీ టైమింగ్ తేడా కొట్టడంతో స్పందన అంతంతమాత్రంగా ఉ:ది. ఇక బాలయ్య మూవీ ‘లెజెండ్’ను స్వయంగా నిర్మాతలైన ‘14 రీల్స్’ వాళ్లే రీ రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం రీ రిలీజ్ ట్రైలర్ కూడా వదిలారు. కానీ 30న రాబోతున్న ఈ సినిమా గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్దగా సౌండ్ లేదు. బుకింగ్స్, కలెక్షన్లు కూడా గొప్పగా ఉంటాయనే సంకేతాలేమీ కనిపించడం లేదు. చూస్తుంటే రీ రిలీజ్‌ల వైభవానికి తెరపడినట్లే కనిపిస్తోంది.

This post was last modified on March 27, 2024 2:49 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

5 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago