ఒక సినిమాకు సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి దర్శకుడు. ఎవరి ఇమేజ్, ఫాలోయింగ్ ఎలా ఉన్నప్పటికీ దర్శకుడి తర్వాతే ఎవరైనా. అందుకు కెప్టెన్ ఆఫ్ ద షిప్‌కు దక్కే గౌరవమే వేరు. ఆ స్థానాన్ని అందుకోవడానికి వేరే శాఖల వాళ్లు కూడా ప్రయత్నిస్తుంటారు. వివిధ విభాగాల మీద కొంత పట్టు వచ్చాక దర్శకత్వం చేయడానికి రెడీ అవుతుంటారు. తెలుగు సినిమా విషయానికి వస్తే ఈ జాబితాలో హీరోల సంఖ్య చాలా చాలా తక్కువ.
ఇప్పుడు టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ ఆ అరుదైన జాబితాలో చేరబోతుండటం విశేషం. కొన్ని రోజుల కిందటే నిఖిల్ ఇంట్లో సీరియస్‌గా పేపర్ మీద ఏదో రాసుకుంటున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. త్వరలో ఒక ఆసక్తికర విషయం చెప్పనున్నట్లు కూడా ఊరించాడు.
ఐతే ఆ విషయం.. నిఖిల్ దర్శకత్వం చేయబోతుండటమే అని వెల్లడైంది. ఐతే పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం కాకుండా నిఖిల్ ప్రయోగాత్మకంగా కొందరు పిల్లలతో షార్ట్ ఫిలిం లాంటిదేదో చేస్తున్నాడని అంటున్నారు. ఈ విషయమై ఓ టీవీ కార్యక్రమంలో కూడా నిఖిల్ సంకేతాలు అందించాడు.
తన సినిమాల కథా చర్చల్లో, మేకింగ్‌లో నిఖిల్ బాగా ఇన్వాల్వ్ అవుతాడని పేరుంది. అతడికంటూ ఓ అభిరుచి ఉందని ఎంచుకున్న సినిమాల్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ అభిరుచితోనే దర్శకుడిగా మారబోతున్నాడు.
ఇటీవలే పెళ్లి చేసుకున్న నిఖిల్.. ఈ ఉత్సాహంలో దర్శకుడిగా మారబోతుండటం విశేషమే. మరి అతను ఎలాంటి సినిమా తీసి, ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం నిఖిల్ చేతిలో కార్తికేయ-2, 18 పేజెస్ సినిమాలున్నాయి.
This post was last modified on September 14, 2020 11:44 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…