ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప 2 ది రూల్ కు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో సమంతా మరోసారి స్పెషల్ సాంగ్ చేయొచ్చనే టాక్ కూడా ఉంది. మొదటి భాగంలో ఊ అంటావా ఊహూ అంటావా అంటూ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అందరిని షేక్ చేసిన సామ్ మళ్ళీ బన్నీతో కాలు కదుపుతోందని, ప్రత్యేకంగా కొన్ని డైలాగులతో కూడిన సన్నివేశాలు కూడా పెట్టారని ప్రచారంలోకి వచ్చింది. కానీ అవేవి నిజం కాదని, అసలు ఆ ఆలోచన కూడా సుకుమార్ లో లేదని యూనిట్ టాక్.
స్పెషల్ సాంగ్ చేయడానికి హీరోయిన్ కోసం సుకుమార్ కసరత్తు చేస్తున్న మాట నిజమే కానీ ఆ టెన్షన్ లో పడి అసలు పనిని రిస్క్ లో పెట్టడం లేదు. సీరియస్ గా టాకీ పార్ట్ ని పూర్తి చేసేందుకు రేయి పగలు కష్టపడుతున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో యాగంటికి వెళ్లి మరీ కీలక ఎపిసోడ్ తీస్తున్నారు. ఫహద్ ఫాసిల్ తో పెండింగ్ ఉన్న సీన్లను త్వరలోనే ఫినిష్ చేయబోతున్నారు. రష్మిక మందన్న ఇతర కమిట్ మెంట్లకు చిన్న బ్రేక్ ఇచ్చి పుష్ప 2కే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ పాటల పని పూర్తి చేసి రీ రికార్డింగ్ చేయడానికి కాపీ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇక వాయిదాకు సంబంధించిన గాసిప్ లో కూడా ఎలాంటి పస లేదు. ఆగస్ట్ 15కి కట్టుబడాలని మైత్రి మేకర్స్ డిసైడ్ అయ్యారు. కల్కి 2898 ఏడి కనక మే నుంచి తప్పుకున్నా సరే దాంతో సహా ఎవరికీ ఆ డేట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఇంకా నాలుగు నెలలే సమయం ఉన్నప్పటికీ బన్నీ, సుకుమార్ ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ప్లాన్ ప్రకారం మొత్తం పూర్తయ్యేలా చూసుకుంటున్నారు. పబ్లిసిటీని జూన్ నుంచి లాంచ్ చేయబోతున్నారట. ఈసారి ముందు నుంచే హిందీ వెర్షన్ కు సంబంధించిన ప్రమోషన్లను మొదలుపెడతారని తెలిసింది. సో ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
This post was last modified on March 27, 2024 12:08 am
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…