ఎట్టకేలకు మలయాళం బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో ఏప్రిల్ 6 విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని దృష్టిలో పెట్టుకుని పోటీ లేకుండా ఒక రోజు ఆలస్యంగా మైత్రి మూవీ మేకర్స్ ద్వారా థియేటర్లలో అడుగు పెట్టనిస్తున్నారు. నిజానికి డబ్బింగ్ వెర్షన్ బాగా ఆలస్యమయ్యిందని చెప్పాలి. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే మార్చి రెండు లేదా మూడో వారంలోనే తెద్దాం అనుకున్నారు. కానీ అనువాద కార్యక్రమాలతో పాటు సెన్సార్ లో జరిగిన జాప్యం వల్ల ఎదురు చూడక తప్పలేదు. ఓం భీమ్ బుష్ తో పాటు వచ్చేసినా పనయ్యేది.
ఇప్పుడీ మంజుమ్మల్ బాయ్స్ కు ఆలస్యం అమృతంగా మారుతుందో లేదో చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఉండబట్టలేక మూవీ లవర్స్ ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ చూసేశారు. బాష రానివాళ్ళ కోసం మల్టీప్లెక్సులు సబ్ టైటిల్స్ కూడా వేయించాయి. ఒక్క భాగ్యనగరంలోనే రెండు వారాల్లో వందకు పైగా షోలు హౌస్ ఫుల్స్ కావడం అబద్దం కాదు. అలా అని తెలుగు చూడరని కాదు కానీ ఇంత గ్యాప్ వచ్చాక సహజంగానే ఆడియెన్స్ చూపు ఓటిటి మీదకు వెళ్తుంది. దీన్ని దాటుకోవాలంటే మంజుమ్మల్ బాయ్స్ కేరళ లాగే ఇక్కడ ఎక్స్ ట్రాడినరి టాక్ తెచ్చుకోవాలి.
ప్రేమలు సక్సెస్ చూశాక దీని మీద నమ్మకం పెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే టిల్లు స్క్వేర్ వచ్చిన వారానికి, ఫ్యామిలీ స్టార్ రిలీజైన మరుసటి రోజే ఇంత కాంపిటీషన్ తట్టుకోవడం సులభం కాదు. మలయాళంలో రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలుస్తున్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ తమిళనాడులో కూడా భారీగా ఆడింది. ప్రత్యేకంగా ప్రమోషన్లను ప్లాన్ చేయబోతున్నారు నిర్మాతలు. కమల్ హాసన్ గుణ సినిమాలో ప్రియతమా కుశలమా పాటని పట్టుకుని కొడైకెనాల్ గుహల్లో తీసిన ఈ చిన్న బడ్జెట్ మూవీ ఎలాంటి అద్భుతం చేస్తుందో చూడాలి.
This post was last modified on March 26, 2024 11:20 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…