Movie News

కొత్తమ్మాయి.. ఊపు ఊపేలా ఉందే

ఆయేషా ఖాన్.. కొన్ని రోజులుగా సోషల్ మీడియలో ట్రెండ్ అవుతున్న పేరు. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘ఓం భీం బుష్’లో ఈ అమ్మాయి ఓ పాత్ర చేసింది. సినిమాలో మరీ అంత ప్రాధాన్యం ఉన్న పాత్రేమీ కాదు తనది. ఒక వ్యాంప్ తరహాలో ఉంటుంది తన క్యారెక్టర్.

కానీ హీరోయిన్ ప్రీతి ముకుందన్ కంటే ఆయేషా మీదే ప్రేక్షకుల ఫోకస్ నిలిచింది. అందుక్కారణం ఆమె గ్లామరస్‌గా కనిపించడం. చేపల ఫ్రై అమ్మే అమ్మాయిగా ఆమె చేసిన క్లీవేజ్ షో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ అమ్మాయికి బ్రేక్ ఇవ్వాలని ఫిక్సయిన యువ ప్రేక్షకులు తన పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

ఇంతలోనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఆయేషా చేసిన ‘మోత మోగిపోద్ది’ అనే పాటకు సంబంధించి ప్రోమో రిలీజ్ కాగా.. అందులోనూ ఆయేషా చేసిన క్లీవేజ్ షో పాట పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగించింది. ఈ రోజు దీని లిరికల్ సాంగ్ రిలీజైంది. అందులో ఆయేషా కనిపించిన ప్రతిసారీ హైలైట్ అయింది. కేవలం ఆయేషా వల్లే ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

సూపర్ సెక్సీగా, హాట్ హాట్‌గా కనిపించే ఆయేషా మున్ముందు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేలా కనిపిస్తోంది. హిందీ ‘బిగ్ బాస్’ 17వ సీజన్లో కంటెస్టెంట్‌గా వెళ్లడం ద్వారా ఆయేషా ఫేమ్ సంపాదించింది. ఆమె సినిమా కెరీర్ టాలీవుడ్‌తోనే మొదలైంది. ఆల్రెడీ ‘ముఖచిత్రం’ అనే సినిమాలో నటించిన ఆయేషా.. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ’ భాస్కర్‌లోనూ ఒక స్పెషల్ రోల్ చేస్తోంది.

This post was last modified on March 25, 2024 4:23 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago