నిన్ను కోరి, ఊపిరి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గీత గోవిందం, మజిలీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ లాంటి చిత్రాల్లో మెస్మరైజింగ్ మెలోడీస్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. ఐతే కెరీర్ ఆరంభంలో మాదిరి ఆయన మెరుపులు మెరిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైగా పాత ట్యూన్లను రిపీట్ చేస్తున్నాడని.. వేరే సంగీత దర్శకుల పాటలను అనుకరిస్తున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్-విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో గోపీసుందర్ ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా టీజర్‌కు అతడి స్కోర్ అస్సలు సూట్ కాలేదు. దాని మీద బాగా ట్రోలింగ్ జరిగింది. పాటల విషయంలోనూ అసంతృప్తే వ్యక్తమవుతోంది.
‘ఫ్యామిలీ స్టార్’ నుంచి రిలీజ్ చేసిన రెండో పాట ‘కళ్యాణి వచ్చా’ పాట చాలా పాత పాటల మిక్స్ లాగా అనిపించింది. ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా..’ పాట ట్యూన్‌కు చాలా దగ్గరగా అనిపించింది ఈ ట్యూన్. రెంటినీ పోలుస్తూ సోషల్ మీడియాలో గోపీసుందర్‌ను నెటిజన్లు ఆడుకున్నారు.
ఇక ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి కొత్తగా ఇంకో పాట వచ్చింది. మధురము కదా.. అంటూ సాగిన ఆ పాట వినసొంపుగా ఉంది. శ్రీమణి లిరిక్స్‌తో పాటు ట్యూన్, శ్రేయా ఘోషల్ సింగింగ్.. అన్నీ బాగున్నాయి. కానీ ఈ పాట మొదలవగానే.. ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా చలే’ పాటే గుర్తుకు వస్తోంది. సేమ్ స్టయిల్లో ఈ పాట సాగింది. గోపీసుందర్ తెలిసి చేశాడా.. తెలియక చేశాడా తెలియదు కానీ.. ‘జియా చలే’కు ఇది కాపీలాగే ఉంది. ట్యూన్ చేసినపుడు కొంచెమైనా చెక్ చేసుకోరా.. ఇలా కాపీ కొట్టేస్తారా అంటూ నెటిజన్లు అతడిపై కౌంటర్లు వేస్తున్నారు.
This post was last modified on March 25, 2024 4:17 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…