ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేయడమే ప్రపంచంగా ఉంటున్న అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దానికి మూడో భాగం ఉంటుందో లేదో అత్యంత సన్నిహితులకు కూడా చెప్పడం లేదట. సీక్వెల్ కు సరిపడా కథ సుక్కు వద్ద సిద్ధంగా ఉంది. ఒకప్పుడు పుష్పని వెబ్ సిరీస్ గా తీసే ఆలోచనతో పెద్ద లెన్త్ తో రాసుకున్నారు. తీరా బన్నీ సినిమాగా చేయడానికి సుముఖత చూపించడంతో సీన్ మారిపోయి ఏకంగా ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే పుష్ప 3 ది రోర్ కు సంబంధించి ఈ ఇద్దరూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇన్ సైడ్ టాక్. ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి.
కొన్ని చిక్కుముడులు గమనిస్తే సమస్య ఎక్కడుందో అర్థమవుతుంది . సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ కు కమిట్ మెంట్ ఇచ్చాడు. మైత్రి బ్యానర్ లోనే రూపొందనుంది. దీని తాలూకు కాన్సెప్ట్ పోస్టర్ ని మార్చి 27 రిలీజ్ చేయొచ్చు. బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న ఆర్సి 16కి ఎంత లేదన్నా పోస్ట్ ప్రొడక్షన్ కు కలిపి ఏడాదిన్నర పైగా టైం కావాలి కాబట్టి ఆలోగా సుకుమార్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఒక కండీషన్ అప్లై అవ్వాలి. పుష్ప 3 వద్దని అల్లు అర్జున్ చెబితేనే ఇది సాధ్యమవుతుంది. ఇంకోవైపు ఆట్లీ చెప్పిన లైన్ ఒకటి బన్నీని అంతగా మెప్పించలేదని చెన్నై టాక్.
ఇంకో స్టోరీ కోసం అట్లీ బృందం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇది ఓకే అయితేనే ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. సో పుష్ప 3 వద్దనుకుంటే చరణ్ 17, బన్నీ త్రివిక్రమ్ లేదా అట్లీ సినిమాకు సంబంధించిన పనులు మొదలైపోతాయి. వీటికి సమాధానం వెంటనే దొరకడం కష్టం. పుష్పకున్న క్రేజ్ దృష్ట్యా మూడు భాగాలైనా వర్కౌట్ అవుతుందనేది నిర్మాతల ఆలోచన. బయ్యర్లు కూడా సానుకూలంగానే ఉన్నారట. ముందైతే ఆగస్ట్ 15 విడుదలకు పుష్ప 2 పక్కాగా రెడీ అయితేనే ఇక్కడ చెప్పినవన్నీ ముందు వెనుక జరుగుతాయి. అప్పటిదాకా ఎదురుచూపులు తప్పవు.
This post was last modified on March 25, 2024 1:30 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…