హాలీవుడ్లో సత్తా చాటుకున్న భారతీయ నటీనటులు చాలా తక్కువమంది. అందులో ప్రియాంక చోప్రా ఒకరు. ఆమె హాలీవుడ్లో నటించిన సినిమాలు, టీవీ షోలు కలిపితే రెండంకెల సంఖ్యలోనే ఉంటాయి. అంతే కాదు.. హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కంది ప్రియాంక.
ఐతే సౌత్ సినిమాలు చేసి బాలీవుడ్లో సెటిలైన హీరోయిన్లు ఇక్కడి సినిమాల గురించి తక్కువ చేసిన మాట్లాడినట్లే.. హాలీవుడ్‌కు వెళ్లాక ప్రియాంక చోప్రా సైతం బాలీవుడ్‌ను కొంచెం తగ్గించేలా వ్యవహరించడం దుమారం రేపింది.
ఆ మధ్య ఒక అంతర్జాతీయ సినీ వేడుకలో తనను ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయికి భారతీయ సినిమాల్లో డ్యాన్సులు ఎలా ఉంటాయో చూపిస్తూ.. ఇండియన్ సినిమాలంటే నడుము.. ఎదభాగమే అని పేర్కొంటూ ఇక్కడి సినిమాల్లో స్టెప్స్ ఎలా ఉంటాయో చేసి చూపించడం విమర్శలకు దారి తీసింది.
అంతే కాక కొన్ని గ్యాంగ్స్ వల్ల తాను బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్‌కు వెళ్లిపోవాల్సి వచ్చిందని మరో సందర్భంలో పేర్కొంది ప్రియాంక. ఆమె తీరు చూస్తే తిరిగి బాలీవుడ్‌కు వచ్చే ఉద్దేశమే లేదనిపించింది. కానీ ఆమె త్వరలోనే బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ కొత్త చిత్రంలో ప్రియాంక నటించనుందట. ఆయన కథలో ఓ పాత్రకు ఆమె ఓకే చెప్పిందట. బన్సాలీతో ఇప్పటికే ‘బాజీరావు మస్తానీ’ సినిమా చేసింది ప్రియాంక. ఆయనపై ఆమెకు అమితమైన గౌరవముంది.
ఈ నేపథ్యంలోనే బన్సాలీ కాబట్టి మళ్లీ హిందీ సినిమా చేయడానికి ఓకే అన్నట్లుంది. మరి ఇంతకుముందు బాలీవుడ్‌ను తక్కువ చేసేలా వ్యవహరించిన ప్రియాంక పట్ల ఇండస్ట్రీ, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 2019లో వచ్చిన ‘ది స్కై ఈజ్ పింక్’ ప్రియాంక చివరి హిందీ చిత్రం.
This post was last modified on March 24, 2024 1:13 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…