‘అంధాదూన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి చూపించాలనేది నితిన్ ముచ్చట. అత్యద్భుతమైన కథ కథనాలతో అంతర్జాతీయ శ్రేణి సినిమాలకు తీసిపోని ఆ హిందీ చిత్రాన్ని తెలుగు యువత చాలా వరకు చూసేసినా కానీ మెజారిటీ తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నితిన్ ఆశ పడుతున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో చేయాలని తలపెట్టాడు.
ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేసేసాడు. అయితే అంధాధూన్‍లో హీరో క్యారెక్టర్ కంటే కీలకం ఒక ఆంటీ పాత్ర. హిందీలో టబు ఆ పాత్రని అద్దిరిపోయే లెవల్లో పర్‍ఫార్మ్ చేయడం వల్లే ఆ సినిమా అంతగా క్లిక్ అయింది. తెలుగు రీమేక్‍లో ఆ పాత్ర ఎవరితో చేయించాలనేది నితిన్‍కి మొదట్నుంచీ సవాల్‍గా మారింది. ఆ పాత్ర రేంజ్‍కి తగ్గట్టు వుండాలని నయనతారలాంటి వాళ్లను కూడా సంప్రదించాడు. కానీ అలాంటి పాత్ర చేయడానికి నయనతార ఏకంగా తొమ్మిది కోట్ల పారితోషికం అడిగిందట.
ఆమెకు అంతిస్తే వ్యాపార పరంగా ‘అంధకారం’ తప్పదని భయపడి టబునే సంప్రదించారు. అయితే ఒకసారి చేసేసిన పాత్ర మళ్లీ చేయడం టబుకి నచ్చదు కనుక ఆమె నో అనేసింది. దీంతో శ్రియ, ప్రియమణి లాంటి వాళ్ల పేర్లు పరిశీలనలో వున్నాయి కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. నితిన్ మాత్రం అవుట్‍డేటెడ్ హీరోయిన్లు చేస్తే ఏమి మజా వుంటుందని అంటున్నట్టు సమాచారం.
This post was last modified on September 13, 2020 9:31 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…