Movie News

టాలీవుడ్ కోసం మంచు విష్ణు భారీ ఈవెంట్

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) కోసం భారీ భవనం కట్టించడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపడతాననే హామీలు ఇచ్చి రెండేళ్ల కిందట ‘మా’ ఎన్నికల్లో గెలిచాడు మంచు విష్ణు. బిల్డింగ్ కట్టించకపోయినా కొన్ని హామీలైతే నెరవేర్చాడు. ఐతే ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ఇండస్ట్రీ తరఫున పెద్ద ఈవెంట్ అయితే ఏదీ చేయలేదు.

కొన్ని కార్యక్రమాల కోసం ప్లానింగ్ జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. ఐతే ఈ ఏడాది జులైలో మలేషియాలో భారీ ఎత్తున టాలీవుడ్ కోసం ఓ ఈవెంట్ చేయబోతున్నట్లు మంచు విష్ణు వెల్లడించాడు. హైదరాబాద్‌లో జరిగిన ‘మా’ ప్రెస్ మీట్లో విష్ణు ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘నవతి’ పేరుతో ఈ ఈవెంట్ జరుగుతుందని, నభూతో అనేలాగా ఈ ఈవెంట్ నిర్వహిస్తామని విష్ణు వెల్లడించాడు.

“రెండేళ్ల కిందట ‘వనతి’ పేరుతో 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్‌ చేయాలనుకున్నాం. అనేక కారణాల వల్ల ఆ వేడుక వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి ఈవెంట్స్‌ గతంలో కూడా జరిగాయి. అప్పటి టీమ్ ఫండ్ రైజింగ్ కూడా బాగా చేసింది. ఇప్పుడు అంతకుమించి ఫండ్‌ రైజ్‌ అయ్యేలా భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

ఈ ఈవెంట్ మలేషియాలో నిర్వహిస్తాం. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి డేట్ ప్రకటిస్తాం. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు స్వర్ణయుగం నడుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి గారికి పద్మవిభూషణ్‌ రావడం గొప్ప విషయం. కీరవాణి గారు ఆస్కార్‌ అందుకున్నారు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ప్రభాస్‌ హైయెస్ట్ పెయిడ్‌ ఇండియన్ యాక్టర్‌ అయ్యాడు. మహేష్‌-రాజమౌళి సినిమా ఆసియాలోనే బిగ్గెస్ట్ మూవీ కాబోతోంది.

తెలుగు సినిమా ఇన్ని ఘనతలు సాధించిన ఈ సమయంలో ఇలాంటి ఉత్సవం చేయడం కరెక్ట్‌ అనిపించింది. ఈ విషయం గురించి ఛాంబర్‌ పెద్దలతో మాట్లాడాం. రెండు, మూడు రోజులు ఇండస్ట్రీకి సెలవు ఇవ్వాలని కోరాం. దిల్‌ రాజు గారు, దాము గారు సపోర్ట్‌ చేస్తామన్నారు. తెలుగు సినిమా ఘనకీర్తిని చాటిచెప్పేలా నవతి ఈవెంట్‌ చేయబోతున్నాం’’ అని విష్ణు తెలిపాడు.

This post was last modified on March 23, 2024 1:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

3 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

7 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

8 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

9 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

9 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

11 hours ago