Movie News

తెలివిగా అడుగులేస్తున్న అనుష్క శెట్టి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత స్వీటీ అనుష్క వరసగా సినిమాలు చేస్తుందని అభిమానులు ఎదురుచూశారు కానీ తను మాత్రం చాలా తెలివిగా ఆచితూచి అడుగులు వేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. విశ్వంభరకు త్రిష కన్నా ముందు ఆ పాత్రను తనకే ఆఫర్ చేశారని గతంలో టాక్ వచ్చింది. అయితే పెద్ద కాన్వాస్ కావడం, మెయిన్ హీరోయిన్ తనే అయినప్పటికీ మరో ముగ్గురు స్క్రీన్ షేర్ చేసుకునే కథ కావడంతో వద్దనుకుంది. స్వంతంగా భావించే యువి క్రియేషన్స్ బ్యానర్, చిరంజీవి సరసన జోడిగా అయినా సరే బాగా అలోచించి సున్నితంగా నో చెప్పేసింది.

దాని స్థానంలో క్రిష్ దర్శకత్వంలో ఘాటికి ఓటేసింది. వేదంలో వేశ్యగా తనలో ఉత్తమ నటిని బయటికి తీసుకొచ్చిన దర్శకుడిగా మరోసారి నమ్మింది. దానికి తగ్గట్టే అమాయకంగా మొదలై గంజాయి వ్యాపారంలో మాఫియా స్థాయికి ఎదిగిన ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. పెర్ఫార్మన్స్ ఇంత స్కోప్ ఉండటమే కాక స్టోరీ మొత్తం తన చుట్టే తిరిగేది కావడంతో ఆలోచించలేదు. ఇంకోవైపు మలయాళం డెబ్యూ కతనర్ లోనూ హారర్ టచ్ ఉన్న ఒక జానపద పాత్రను చేస్తోన్న అనుష్క అక్కడి తెరంగేట్రంలోనూ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టరే దక్కించుకుంది.

ఎవరి సరసన నటిస్తున్నా అనే దానికన్నా ఎంత గుర్తింపు వస్తుందనే దాని మీద అనుష్క ఫోకస్ పెడుతోంది. భాగమతి 2 తీయాలనే ఆలోచన జరిగినా కథా, సరైన దర్శకుడు రెండు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచన మానుకున్నారు. ఘాటి, కథనర్ రెండూ ప్యాన్ ఇండియా సినిమాలే. హిందీతో సహా ప్రధాన భాషల్లో విడుదలకు ప్లాన్ చేయబోతున్నారు. క్రిష్ ఈ ఏడాదిలోనే ఘాటీ రిలీజ్ చేసేలా సెట్ చేస్తున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు బ్యాలన్స్ వైపు దృష్టి పెట్టాలి. కతనర్ మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇవి కాకుండా వేరే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు స్వీటీ.

This post was last modified on March 23, 2024 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

5 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

11 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

14 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

15 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

15 hours ago