Movie News

శివణ్ణ సినిమాలను బ్యాన్ చేయమంటున్నారు

ఒకప్పుడు అంతగా పరిచయం ఉండేది కాదు కానీ జైలర్ పుణ్యమాని శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మనకూ సుపరిచితుడుయ్యాడు. దీనికన్నా ముందు బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథకుడిగా స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ అది అంతగా మాస్ కు రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే పెద్ది (ప్రచారంలో ఉన్న టైటిల్) లో కీలక పాత్ర చేయనుండటంతో దానికి సంబంధించి ఆయన చెప్పిన ఇంటర్వ్యూ వీడియోలు మెగా ఫ్యాన్స్ ద్వారా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక అసలు ట్విస్టింగ్ పాయింట్ కొద్దాం.

కర్ణాటకలో శివరాజ్ కుమార్ సినిమాలు, పోస్టర్లు, పబ్లిసిటీ మెటీరియల్స్ అన్నింటి మీద నిషేధం విధించాలని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. కారణం ఆయన భార్య గీత శివమొగ్గ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీకి నిలుచున్నారు. స్వతహాగా ఆ పార్టీ అభిమాని కావడంతో పాటు సతీమణినే బరిలో ఉండటంతో శివన్న ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రాలు జనాల మీద ప్రభావం చూపిస్తాయని కాబట్టి ఎలక్షన్లు అయ్యేవరకు వాటిని బ్యాన్ చేయాలని విన్నవించారు. కమీషన్ పరిశీలిస్తామని చెప్పడం విశేషం.

ఇలా నిజంగా చేసే పనైతే ఏపీ, తెలంగాణ, తమిళనాడులో కూడా స్టార్ హీరోలు ప్రచారానికి వెళ్లే క్రమంలో వాళ్ళ సినిమాలను నిషేదించాలని చెప్పే కొత్త డిమాండ్లు పుట్టుకొస్తాయేమో. బాలకృష్ణ, శరత్ కుమార్ తదితరులంతా నేరుగా అభ్యర్థులుగా బరిలో ఉన్న వాళ్లే. టీవీలో థియేటర్లలో హీరోలను చూసి ఓట్లు వేసేస్తారని అనుకోవడం సరికాదు. ఎంత ఆరాధించినా ప్రజాక్షేత్రంలో ఓటర్ల లెక్కలు వేరుగా ఉంటాయి. ఊరికే అభిమాన స్టార్ చెప్పాడని గెలిపించే పనైతే స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత కనీసం ఓ ఇద్దరు హీరోలైనా సిఎం అయ్యేవారు. కానీ అలా జరగలేదుగా. సినిమా, రాజకీయం రెండు వేరు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేస్తాం: రాహుల్‌

దేశంలో రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి 50 శాతంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏ రిజ‌ర్వేష‌న్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వ‌డానికి…

2 hours ago

100 కోట్ల వసూళ్లకు బన్నీ వాస్ హామీ

తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…

3 hours ago

అసలైన దీపావళి విన్నర్ ఇదే..

ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…

4 hours ago

అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందే.. టీడీపీ స్ట్రాట‌జిక్ స్టెప్‌!

మ‌రో వారంలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి పూర్తిగా బ‌డ్జెట్ స‌మావేశాలేన‌ని కూట‌మి స‌ర్కారు చెబుతోంది. వ‌చ్చే మార్చి…

4 hours ago

నాని ‘ప్యారడైజ్’ వెనుక అసలు కహాని

దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…

5 hours ago

‘కూలీ’లో ఆమిర్ ఉన్నాడా అని అడిగితే?

ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…

6 hours ago