జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. మొదటి భాగం అక్టోబర్ 10 విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం టీమ్ మొత్తం గోవాలో షూటింగ్ చేస్తోంది. తారక్ తో పాటు జాన్వీ కపూర్ పాల్గొంటున్న కీలక భాగాన్ని తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక పాట కూడా ఉంది. పబ్లిక్ ప్లేస్ కావడంతో చిత్రీకరణకు సంబంధించిన ఒక వీడియో ఇప్పటికే ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఆసక్తికరంగా ఉంది.
దేవరలో జూనియర్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి యూనిట్ అధికారికంగా చెప్పలేదు కానీ ఎప్పుడో లీకైంది. విశ్వసనీయ సమాచారం మేరకు తండ్రి కొడుకులుగా కనిపిస్తాడు. బాహుబలి తరహాలో అన్న మాట. పెద్ద దేవరకు భార్యగా మరాఠి నటి శృతి మరాఠె నటిస్తోంది. ఈ విషయం ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అనఫీషియల్ గా అఫీషియల్ అయిపోయింది. కథ ప్రకారం చిన్న దేవరకు జాన్వీ కపూర్ జోడిగా కనిపిస్తే, ఒక భాగంలో శృతి ఉంటుందన్న మాట. నటనకు చాలా స్కోప్ దొరికిందని అంటోంది. కొన్ని తమిళ సినిమాలు చేసిన శృతి మరాటేకు ఇది టాలీవుడ్ డెబ్యూ.
అలా అని ఈమె గ్లామర్ రోల్స్ చేసే రకం కాదు. పెర్ఫార్మన్స్ క్యారెక్టర్లే ఎక్కువ చేసింది. కొరటాల వెతికి మరీ తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఆషామాషీ ఎంపిక అయ్యుండదు. విడుదల తేదీ చేరుకోవాలనే లక్ష్యంతో షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్న దేవర నుంచి ఏదైనా టీజర్ లేదా ట్రైలర్ లాంటి కీలక అప్డేట్ ని ఉగాది సందర్భంగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీమ్ గోవాలో బిజీగా ఉన్న నేపథ్యంలో సాధ్యం కాకపోవచ్చు. జూలై నుంచి ప్రమోషన్లు ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు తారక్, కొరటాల. ఆర్ఆర్ఆర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తో జూనియర్ చేస్తున్న సినిమా ఇదే.
This post was last modified on March 23, 2024 8:38 am
వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా…
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…