టాలీవుడ్ యువ కథాానాయకుడు అక్కినేని నాగచైతన్యకు కొన్నేళ్ల నుంచి అంతగా కలిసి రావడం లేదు. తన చివరి రెండు చిత్రాలు కస్టడీ, థ్యాంక్యూ డిజాస్టర్లయ్యాయి. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా దారుణమైన ఫలితాన్నందుకుంది. అంతకుముందు బంగార్రాజు, లవ్ స్టోరీ, వెంకీ మామ కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు అతడికి ఒక పెద్ద హిట్ అవసరం.
‘తండేల్’ అలాంటి సినిమానే అవుతుందని ధీమాగా ఉన్నాడు చైతూ. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈసారి చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో కసరత్తు చేశాక ఆ సినిమా చేస్తున్నాడు చైతూ. మధ్యలో వేరే కథలు కూడా ఏవీ వినలేదు. ‘తండేల్’ చిత్రీకరణ వేగంగా సాగుతుండటం, ఔట్ పుట్ కూడా చాలా బాగా వస్తుండటంతో ఈ సినిమా మీద ధీమాతో కొత్త కథలు వినడం మొదలుపెట్టాడట చైతూ. తాజాగా అతను ఒక సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో చైతూ జట్టు కట్టబోతున్నాడట. ‘విరూపాక్ష’ తర్వాత దానికి సీక్వెల్ తీయాలని అనుకున్నాడు కార్తీక్. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. కొన్నాళ్లు దాని మీద పని చేసి పక్కన పెట్టేశాక చైతూ కోసం వేరే కథ రాయడం.. ఇటీవలే దాన్ని చైతూకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం జరిగాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందట.
‘విరూపాక్ష’కు భిన్నమైన కథతో ఈసారి సినిమా చేయబోతున్నాడట కార్తీక్. ఇందులో కమర్షియల్ టచ్ ఎక్కువ ఉంటుందట. ‘భమ్ భోలేనాథ్’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారాడు కార్తీక్. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. తర్వాత చాలా ఏళ్లు టైం తీసుకుని తన గురువు సుకుమార్ రచనా సహకారంతో చేసిన ‘విరూపాక్ష’ అతడికి ఘనవిజయాన్ని అందించింది.
This post was last modified on March 22, 2024 2:57 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…