జాన్వి కపూర్.. ఈ పేరు చూసి ఉత్తరాది అమ్మాయి ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఆమెలో దక్షిణాది మూలాలు ఉన్న సంగతి మరువరాదు. ఆమె తెలుగు కుటుంబంలో పుట్టిన అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు కావడంతో సౌత్ కనెక్షన్‌ను ఎప్పుడూ మరిచిపోలేదు. చిన్నతనం నుంచే తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు సంస్కృతిని అనుసరిస్తూ సాగుతోంది జాన్వి. అంతే కాదు.. తన తల్లి లాగే ఆమెకు తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే విపరీతమైన భక్తి. చిన్నతనం నుంచి జాన్వి తిరుమలకు రాని సంవత్సరమే లేదట.
ఒక వయసు వచ్చేవరకు తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వచ్చేది జాన్వి. యుక్త వయసుకు వచ్చే తనే స్నేహితులతో కలిసి తిరుమలను దర్శిస్తోంది. కొన్ని నెలల కిందటే తిరుమలకు వచ్చిన జాన్వి.. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తన కొత్త చిత్రం మొదలైన నేపథ్యంలో మరోసారి శ్రీవారిని దర్శించుకుంది.
ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. మెట్ల మార్గంలో కాలి నడకన జాన్వి తిరుమలకు చేరుకుంది. దీని కంటే విశేషం ఏంటంటే.. ఆమె మోకాళ్ల మీద శ్రీవారి మెట్లను ఎక్కింది. మెట్ల మీద మామూలుగా నడవడమే కష్టం అంటే.. మోకాళ్ల మీద వెళ్లడమంటే ఇంకా కష్టం. ఒక స్టార్ హీరోయిన్ ఇలా చేయడం అరుదైన విషయం. దీన్ని బట్టే జాన్వికి తిరుమల శ్రీనివాసుడంటే ఎంత భక్తో అర్థం చేసుకోవచ్చు.
జాన్వి ఇప్పటిదాకా 50 సార్లకు పైగానే తిరుమలకు వచ్చిందట. తాను మెట్ల మీద మోకాళ్లతో నడుస్తూ తిరుమలకు చేరుకున్న విషయాన్ని వెల్లడిస్తూ ఈ విషయం చెప్పింది జాన్వి. ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇదిలా ఉంటే.. జాన్వి నెమ్మదిగా తెలుగు సినిమాల్లో బిజీ అవుతూ ఇక్కడ టాప్ హీరోయిన్లలో ఒకరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అరంగేట్రమే ఎన్టీఆర్ మూవీ ‘దేవర’తో చేస్తున్న ఆమె.. ఇప్పుడు చరణ్‌తో నటించబోతోంది.
This post was last modified on March 22, 2024 1:48 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…