లెజెండరీ నటుడు.. ఒక సెన్సేషనల్ ఫొటో షూట్

మామూలుగా సినీ తారల లుక్స్ విషయానికి వస్తే అందరి ఫోకస్ హీరోలు, హీరోయిన్ల మీదే ఉంటుంది. వయసు పెరుగుతన్నా ఆ ప్రభావం కనిపించకుండా లుక్స్ ఫిజిక్, లుక్స్ మెయింటైన్ చేసే వాళ్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. వాళ్ల గురించి ఎప్పుడూ చర్చ నడుస్తుంటుంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్ల విషయంలో ఈ రకమైన పట్టింపు ఏమాత్రం ఉండదు.

తమిళ లెజెండరీ నటుడు నాజర్ విషయమే తీసుకుంటే.. ఆయన నాలుగు దశాబ్దాలుగా నటిస్తున్నారు. తెలుగు వాళ్లకు కూడా మూడు దశాబ్దాల నుంచి ఆయన పరిచయం. 90ల్లోనే ‘మాతృదేవోభవ’ సినిమాతో చెరగని ముద్ర వేశారాయన. ఐతే అప్పటికి ఇప్పటికి లుక్స్‌లో పెద్ద మార్పయితే కనిపించదు. పరిచయం కావడమే మిడిలేజ్డ్ క్యారెక్టర్లలో కనిపించిన ఆయన ఇప్పుడు కూడా అలాంటి పాత్రలు వేస్తున్నారు. కొన్నిసార్లు మాత్రం వృద్ధుడి పాత్రల్లో కనిపిస్తున్నారు. కానీ ఆయనకు మరీ వయసు పైబడ్డట్లు అయితే కనిపించదు.

తాజాగా నాజర్ ఒక ఆశ్చర్యకరమైన పనితో వార్తల్లోకి వచ్చారు. హీరోలు, హీరోయిన్ల లాగే ఆయనొక స్టైలిష్ ఫొటో షూట్ చేశారు. చక్కగా హేర్ స్టైలింగ్ చేయించుకుని.. ఒక కొత్త లుక్ లోకి మారిన ఆయన.. టీనేజీ కుర్రాడిలో ట్రెండ్ డ్రెస్ వేసుకుని ఈ ఫొటో షూట్ చేశారు. ఈ ఫొటోల్లో నాజర్‌ను చూసిన వాళ్లకు ఒక విభిన్నమైన అనుభూతి కలుగుతోంది. ఇదే లుక్‌లో ఒక క్యారెక్టర్ చేయమని కూడా నాజర్‌ను అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి కూడా.

దశాబ్దాలుగా లుక్స్ పరంగా పెద్దగా మార్పులేమీ లేకుండా మెయింటైన్ చేయడం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్‌కు అంత సులువైన విషయం కాదు. ఒకప్పుడు సీరియస్ పాత్రలకే పరిమితం అయిన ఆయన.. దూకుడు, బాద్‌షా లాంటి సినిమాల్లో ఎంతగా నవ్వించారో తెలిసిందే. ఇప్పటికీ బహు భాషల్లో విలక్షణ పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ ఉత్సాహంగా సాగిపోతున్నారాయన. ఐతే ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది వాస్తవం.