దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవడం పెద్దలు చెప్పిన మాట. అది ఏ కాలానికైనా వరిస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో. ఇటీవలే ప్రేమలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో తెలుగులోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న మమిత బైజుకు ఆఫర్ల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ నుంచి పలువురు నిర్మాతలు దర్శకులు హైదరాబాద్ లో ఉన్నప్పుడే తనను కలిశారు కానీ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తాననే రీతిలో సంకేతాలు ఇవ్వడంతో ప్రస్తుతానికి ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేదు. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ తరహాలో మంచి ప్లానింగ్ తో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
మల్లువుడ్ టాక్ ప్రకారం మొన్నటిదాకా ముప్పై లక్షల దాకా ఉన్న మమిత పారితోషికం ఇప్పుడు యాభై లక్షల దాకా పెరిగినట్టు తెలిసింది. ఇంత మొత్తం ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సిద్ధంగానే ఉన్నారు. ఒకవేళ అవసరమైతే అంత కన్నా ఎక్కువ డిమాండ్ చేసినా ఎస్ అంటున్నారని తెలిసింది. మాములుగా ఒక వర్ధమాన హీరోయిన్ కి అంత రేట్ అరుదు. కానీ ప్రేమలు ఫలితం ఆ అమ్మాయి సుడినే మార్చేసింది. అలా అని మమిత టాలెంట్ కేవలం ఈ సినిమా వల్లే బయట పడలేదు. ఇంతకు ముందు సూపర్ శరణ్యలో పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుని ఏకంగా సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది.
మొన్నటి ఏడాది బాలా దర్శకత్వంలో మొదలైన సినిమాలో కృతి శెట్టితో పాటు మొదట మమిత కూడా ఎంపికయ్యింది. కానీ తను బయటికి వచ్చాక హీరో దర్శకుడి మధ్య ఏవో విబేధాల కారణంగా మొత్తం ప్రాజెక్టు క్యాన్సిలయ్యింది. షూటింగ్ టైంలో బాలా తనను కొట్టాడని మమిత చెప్పినట్టుగా వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఆ తర్వాత మొత్తం సద్దుమణిగింది. ఇదంతా జరిగిపోయిన గతం. జివి ప్రకాష్ సరసన మమిత నటించిన రెబెల్ రేపు విడుదల కానుంది. ఇది తనకు మరింత పేరు తెస్తుందని, తమిళంలో కూడా అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. తెలుగు డబ్బింగ్ జరిగే ఛాన్స్ లేకపోలేదు.
This post was last modified on March 21, 2024 5:04 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…