Movie News

చరణ్ గ్యాంగులో సంజయ్ దత్ ప్రవేశం

నిన్న ప్రారంభోత్సవం జరుపుకున్న రామ్ చరణ్ 16 ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే విపరీతమైన చర్చల్లో నిలుస్తోంది. ఓపెనింగ్ కు ముందే ఇందులో కీలక పాత్ర చేస్తున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్న వీడియోలు ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ క్రేజీగా ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆర్సి 16లో విలన్ గా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని తీసుకొస్తున్నారట. ఆల్రెడీ రామ్, పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ లో నెగటివ్ రోల్ చేస్తున్న సంజు బాబా చరణ్ మూవీకి కూడా ఓకే చెప్పినట్టు ముంబై టాక్.

చూస్తుంటే బుచ్చిబాబు ఆషామాషీగా క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవడం లేదనిపిస్తోంది. పెద్ది టైటిల్ ని దాదాపు ఖరారు చేయొచ్చట. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27 ఒక పోస్టర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది టీమ్. హిందీ నుంచి జాన్వీ కపూర్ – సంజయ్ దత్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఇలా క్రేజీ నటీనటులను ఏరికోరి తీసుకొస్తున్న ఈ ఉప్పెన దర్శకుడు ఇంకో రెండు కీలక పాత్రల కోసం ఓ మలయాళ నటుడు, మరో హిందీ సీనియర్ స్టార్ ని ట్రై చేస్తున్నట్టు సమాచారం. మొదట్లో విజయ్ సేతుపతిని అనుకున్నా డేట్ల సమస్య వల్ల ఆ ఛాన్స్ కాస్తా శాండల్ వుడ్ స్టార్ కొట్టేశారు.

రాబోయే రోజుల్లో మరింత ఎగ్జైట్ మెంట్ కలిగించే విషయాలు దీని గురించి వినిపిస్తాయని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే మూడు పాటలు ఇచ్చేశారు. మరో మూడు వేసవిలోగా అయిపోతాయి. గేమ్ ఛేంజర్ నుంచి బయటికి రాగానే చిన్న విశ్రాంతి తీసుకుని చరణ్ ఈ సెట్లో అడుగు పెడతాడు. కథ చాలా షాకింగ్ గా ఉంటుందని, పల్లెటూరి నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కమర్షియల్ అంశాలను బుచ్చిబాబు రాసుకున్న తీరు సుకుమార్ ని సైతం విపరీతంగా మెప్పించిందట. ఇవన్నీ చూస్తూ మెగా ఫ్యాన్స్ ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా.

This post was last modified on March 21, 2024 3:40 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

6 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago