టాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చరణ్ అభిమానులు ఎప్పుడూ చెప్పుకునే సినిమాల్లో రంగస్థలం ఒకటి. పెర్ఫార్మన్స్ వరంగా ఆర్ఆర్ఆర్ కంటే దీన్నే బెస్ట్ మూవీగా వాళ్ళు ఫీలవ్వడంలో తప్పేం లేదు. దర్శకుడు సుకుమార్ ని ఒక్కసారిగా అగ్ర పీఠం కోసం పోటీ పడేలా చేసింది కూడా ఈ చిత్రమే. అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ తో పుష్ప రెండు భాగాలు కమిటయ్యాక నాలుగేళ్లకు పైగా సుకుమార్ లాక్ అయిపోయాడు. పైగా దాని ఫలితం ప్యాన్ ఇండియా రేంజ్ చేరుకోవడంతో బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగిపోయింది.
సో సరైన సమయంలో మళ్ళీ ఈ కాంబో కార్యరూపం దాల్చబోతోంది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజున మైత్రి మూవీ మేకర్స్ దీన్ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ విషయాన్ని మొన్న పద్నాలుగో తేదినే మా సైట్ ఎక్స్ క్లూజివ్ గా బహిర్గత పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ఖరారుగా ప్రకటన రూపంలో బర్త్ డే కానుకగా ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అయితే షూటింగ్ కు వెళ్ళడానికి టైం చాలా పడుతుంది. ఎందుకంటే పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15 విడుదలయ్యే దాకా సుకుమార్ ఫ్రీ అవ్వలేడు. ఆ తర్వాతే చరణ్ ప్రాజెక్టు తాలూకు స్క్రిప్ట్ పనులు చూసుకోవాల్సి ఉంటుంది.
ఇంకోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి విముక్తి పొందగానే నిన్న లాంఛనంగా మొదలైన బుచ్చిబాబు సినిమా సెట్లో అడుగు పెట్టాలి. కనీసం ఏడాది నిర్మాణానికి వేసుకున్నా 2025 సమ్మర్ దాటిపోతుంది. అప్పటికంత సుకుమార్ ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేసుకోవచ్చు. ఒకవేళ పుష్ప 3 ఉండే పనైతే ఈ గ్యాప్ ఇంకాస్త పెరుగుతుంది. రంగస్థలంని మించి మరో మాస్ డ్రామాని ఆ కలయికలో ఆశించవచ్చు. సంగీతం దేవిశ్రీ ప్రసాదే అందిస్తాడని మరో న్యూస్. చరణ్ ఇమేజ్ లో అమాంతం పెరిగిపోయిన దృష్ట్యా ఈసారి సుకుమార్ చూపించబోయే ఎలివేషన్లు మాములుగా ఉండవని వేరే చెప్పాలా.
This post was last modified on March 21, 2024 12:08 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…