రేపు విడుదల కాబోతున్న ఓం భీమ్ బుష్ మీద శ్రీవిష్ణు నమ్మకం మాములుగా లేదు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త పాయింట్ తీసుకున్నామని, లాజిక్స్ వదిలేసి చూస్తే హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఇస్తున్న హామీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. సాధారణంగా తన సినిమాల మార్నింగ్ షోలకు భారీ ఆక్యుపెన్సీలు కనిపించవు. టాక్ రావడం ఆలస్యం అనూహ్యంగా పికప్ ఉంటుంది. సామజవరగమనకు జరిగింది ఇదే. రెండో రోజు నుంచే హౌస్ ఫుల్స్ మొదలయ్యాయి. దాని కన్నా ఎంటర్ టైన్మెంట్ ఇందులో పదింతలు ఉంటుందని టీమ్ ఊరిస్తోంది.
పదో తరగతి మినహాయించి స్కూల్ పిల్లల చివరి అంకం పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి ఫ్యామిలీస్ కి ఇదే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు నమోదు కావడం ఖాయమనే భరోసాతో ఉన్నారు. సంక్రాంతి తర్వాత భారీగా సందడి చేసిన తెలుగు సినిమాలేవీ లేవు. గామి, ఊరిపేరు భైరవకోన, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు కమర్షియల్ గా సేఫ్ అయ్యాయి కానీ ఆశించిన అద్భుతాలు చేయలేదు. మలయాళ డబ్బింగ్ ప్రేమలుకి మంచి ఫిగర్స్ రావడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓం భీమ్ బుష్ కు భలే ఛాన్స్ దొరికింది.
హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ కట్ తో పాటు పబ్లిసిటీ చాలా వెరైటీగా చేస్తున్నారు. వచ్చే వారం సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ రానున్న నేపథ్యంలో ఓం భీమ్ బుష్ కు మొదటి వారం ఓపెనింగ్ కీలకం కానుంది. వీలైనంత ఫస్ట్ వీక్ రాబట్టుకుంటే ఆపై రెండో వారం నుంచి నెమ్మదించినా సరిపడా లాభాలు కళ్ళచూడొచ్చు. యువి సంస్థ మద్దతు ఉండటంతో థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. పోటీగా చెప్పుకోదగ్గవి ఏవీ లేకపోవడం మరో సానుకూలాంశం.
This post was last modified on March 21, 2024 10:32 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…