2024తో కలిపి రాబోయే రెండేళ్లలో తాము సొంతం చేసుకున్న ప్యాన్ ఇండియా సినిమాల లిస్టుని అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు ప్రకటించేశాయి. వాటిలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ లాంటి స్టార్ హీరోల మూవీసన్నీ కవరైపోయాయి. కానీ ప్రభాస్ కల్కి 2898 ఏడి మాత్రం లేదు. థియేట్రికల్ రిలీజ్ పెట్టుకున్న మే 9 ఎంతో దూరంలో లేదు. ఎన్నికల ప్రకటన వచ్చిన నేపథ్యంలో వాయిదా పడొచ్చనే ప్రచారం జరుగుతోంది కానీ వైజయంతి మూవీస్ నుంచి ఎలాంటి అలికిడి లేదు. పోస్ట్ పోన్ చేస్తేనే మంచిదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. క్లారిటీకి టైం పడుతుంది.
ఈ లెక్కన కల్కి ఓటిటి డీల్ కానట్టే. నిర్మాత ఆశిస్తున్న మొత్తం ఇంకా కోట్ చేయని కారణంగానే ఆలస్యం జరుగుతోందని అంతర్గత వర్గాల సమాచారం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి హిందీ మినహాయించి అన్ని భాషలకు ప్రైమ్ 105 కోట్లు ఆఫర్ చేసిందనే వార్త ఇప్పటికే తెగ తిరిగేస్తోంది. దేవర పార్ట్ 1కు 80 కోట్లకు పైగా డీల్ జరిగిందని గతంలోనే డిజిటల్ వర్గాల్లో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇవి నిజమైతే కల్కికి కనీస ప్రారంభ ధర 150 కోట్ల నుంచి మొదలవ్వాలని కోరుకోవడం తప్పేం కాదు. పైగా ప్రభాస్ రీచ్ ప్రపంచవ్యాప్తంగా ఎవరినీ అందనంత ఎత్తులో ఉందనే వాస్తవం మర్చిపోకూడదు.
సో కల్కి 2898 ఏడి ఇంకా ఎవరి చేతికి చిక్కనట్టే కనిపిస్తోంది. పైకి ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ల మధ్యే పోటీగా కనిపిస్తోంది కానీ హాట్ స్టార్ కూడా రేస్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే రిలయన్స్ తో చేతులు కలిపాక బడ్జెట్ పరంగా హద్దులు ఉండబోవడం లేదు. అలాంటప్పుడు కల్కి లాంటి వాటి కోసం ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు. దర్శకుడు నాగ అశ్విన్ షూటింగ్ లేని టైంలో పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు విఎఫెక్స్ కు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ మే 9 ఫిక్స్ అనుకుంటే ఒకలా లేదంటే మరోలా పెద్ద ఎత్తున ప్రమోషన్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. వర్క్ అయితే చాలా పెండింగ్ ఉందట.
This post was last modified on March 20, 2024 10:11 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…