తీసింది ఒక్క సినిమానే అయినా రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ పట్టేశాక దర్శకుడు బుచ్చిబాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. మూవీ చేయడం పెద్ద విషయం కాదు కానీ అందులో నటిస్తున్న వాళ్ళు, పని చేస్తున్న టీమ్ ఇస్తున్న ఎలివేషన్లు చూస్తే మాత్రం బాప్రే అనిపించక మానదు. ఇవాళ జరిగిన ప్రారంభోత్సవంలో గురువు సుకుమార్ మాట్లాడుతూ తన శిష్యుడు చరణ్ ని ఒప్పిస్తాడని ఊహించలేదని, ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ అనగానే షాక్ కొట్టిందనే రేంజ్ లో చెప్పడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. రెహమాన్ ఏకంగా బుచ్చిబాబుని ప్యాషన్ ఉన్న సినిమా పిచ్చోడిగా వర్ణించడం ఇంకో హైలైట్.
రంగస్థలం టైంలో లైన్ వినిపించాడని చెప్పిన చరణ్ తను సైతం పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడితో అయిపోలేదు. కొద్దిరోజుల క్రితం తన కరటక దమనక ప్రమోషన్ల భాగంగా శివరాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆర్సి 16 ప్రస్తావన తెచ్చి బుచ్చిబాబు చెప్పిన కథ విని మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఒక మనిషి ఎలా ఆలోచించి ఇలాంటి పాత్రలు రాసుకున్నాడాని షాక్ కొట్టినట్టు అయ్యిందని మెచ్చుకున్నాడు. ముప్పై నిమిషాల్లో నెరేషన్ ఇస్తానని చెప్పిన బుచ్చిబాబు ఏకంగా గంటన్నర పాటు శివరాజ్ కుమార్ ని కదలకుండా చేశాడంటే మ్యాటరేదో గట్టిగానే ఉందన్న మాట.
ఈ లెక్కన బుచ్చిబాబు మీద అంచనాల బరువు మాములుగా ఉండేలా లేదు. చూడ్డానికి అతి సామాన్యుడిగా స్టయిలింగ్ అస్సలు పాటించని ఒక మాములు వ్యక్తిగా కనిపించే ఇతను ఎంత పని రాక్షసుడో వీళ్ళ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గేమ్ ఛేంజర్ కాగానే ఆర్సి 16 షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెనతో పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతి చెట్టి చెరో నాలుగైదు సినిమాలకు పైగానే చేసినా బుచ్చిబాబు మాత్రం ఈ స్క్రిప్ట్ కోసమే రెండేళ్లు కష్టపడి ఒక సంవత్సరం పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు.
This post was last modified on March 20, 2024 3:22 pm
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…