ఆకాశం నీ హద్దురాతో జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డులు దక్కించుకున్న దర్శకురాలు సుధా కొంగర హీరో సూర్య కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని ప్రకటించి అయిదు నెలలు దాటేసింది. పురాననూరు టైటిల్ తో భారీ మల్టీ స్టారర్ గా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నజ్రియా, విజయ్ వర్మ లాంటి టాలెంటెడ్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు. క్యాన్సిలయ్యిందనే వార్త కోలీవుడ్ వర్గాల్లో గుప్పుమనడంతో సూర్య అభిమానులు టెన్షన్ పడ్డారు. నిప్పు లేనిదే పొగరాదనే తరహాలో ప్రచారం జరిగింది.
సూర్య, సుధా కొంగరల మధ్య విభేదాల నేపథ్యంలో ఇలా జరిగిందనే టాక్ వచ్చింది. అయితే సినిమా బృందం వీటిని కొట్టి పారేస్తున్నారు. ఆలస్యమవుతున్న మాట నిజమే కానీ ప్రాజెక్ట్ ఆన్ లోనే ఉందని, అతి త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని, మీ ప్రేమకు అభిమానానికి కృతజ్ఞతలని సోషల్ మీడియాలో పేర్కొనడం డౌట్లను క్లియర్ చేసింది. అయినా కూడా అభిమానుల్లో పూర్తిగా అనుమానం తొలగిపోలేదు. ప్రస్తుతం సుధా కొంగర హిందీలో అక్షయ్ కుమార్ తో ఆకాశం నీ హద్దురాని రీమేక్ చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాణ భాగస్వాముల్లో సూర్య, జ్యోతిక ఉన్నారు.
అలాంటప్పుడు అభిప్రాయభేదాలు ఎక్కడ వచ్చాయనేదే సందేహం. దీనికన్నా ముందు సుధా కొంగర విజయ్ తో ఒక సినిమా చేయాలని చాలా ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు. కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే ముందుకెళ్లలేదని వినిపించింది. సూర్య కంగువ మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు. వెట్రిమారన్ తో చేయాల్సిన వడివాసల్ కూడా ఉంటుందో లేదోనని వార్తలు వస్తున్నాయి. రెండు భాగాల కంగువ తనకు బాహుబలి స్థాయిలో గుర్తింపు తెస్తుందని సూర్య చాలా నమ్మకంగా ఉన్నాడు. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో లాంచ్ చేసిన టీజర్ లో విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి.
This post was last modified on March 20, 2024 10:32 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…