హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయి నాలుగేళ్లు కావస్తోంది. ప్రకటించిన కొన్ని నెలలకే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. కానీ మొదలైన నాలుగేళ్లకు కూడా సినిమా రిలీజవుతుందన్న గ్యారెంటీ ఏమీ కనిపించడం లేదు. దీని తర్వాత మొదలైన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజవుతున్నాయి కానీ.. దీనికి మాత్రం మోక్షం కలగట్లేదు. ఇది భారీ సినిమా. పవన్‌కేమో తన రాజకీయ, వేరే సినిమా కమిట్మెంట్ల మధ్య దీని కోసం ఎక్కువ రోజులు కేటాయించే వీలు కుదరట్లేదు. దీంతో సినిమా పూర్తి కావడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది.
కొంత కాలంగా ‘హరిహర వీరమల్లు’ సోషల్ మీడియా జనాలకు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. తాజాగా ‘అమేజాన్ ప్రైమ్’ వాళ్లు ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో ‘హరిహర వీరమల్లు’ పోస్ట్ రిలీజ్ డిజిటల్ హక్కులు తమవే అని ప్రకటించారు.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత ‘హరిహర వీరమల్లు’ ప్రైమ్‌లో రిలీజవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే.. దాని మీద కూడా నెటిజన్లు కామెడీ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తవుతుందో.. థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో తెలియని సినిమా డిజిటల్ హక్కులు కొని డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన ఇవ్వడమా అంటూ ప్రైమ్ వాళ్ల మీద పంచులు వేస్తున్నారు.
ఐతే ఈ సినిమా విషయంలో పవన్ అభిమానుల అసంతృప్తి, సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ గురించి తెలిసి కూడా.. ఆ చిత్ర బృందం ధైర్యంగా అమేజాన్ మీట్‌కు హాజరై.. స్టేజ్ మీద నిలబడింది. సినిమా గురించి కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. ఈ సినిమాను ఎప్పడెప్పుడు ప్రేక్షకులకు చూపించాలా అని ఎదురు చూస్తున్నట్లు క్రిష్ చెబితే.. నిర్మాత రత్నం మాట్లాడుతూ ఎన్నో భారీ చిత్రాలు తీసిన తనకు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ మూవీ అని, ఇది చరిత్ర సృష్టిస్తుందని అన్నాడు. ఇదే స్పిరిట్‌తో పవన్ అందుబాటులోకి రాగానే వీలైనంత సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on March 20, 2024 10:00 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…