సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క కొన్నేళ్ల నుంచి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఆమెకు డిమాండ్ తక్కువేమీ కాకపోయినా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవట్లేదు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఓటు వేస్తోంది. భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఇలా బాహుబలి తర్వాత ఆమె సినిమాల వరుస చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో హీరో పాత్ర కూడా ఉన్నప్పటికీ అనుష్క క్యారెక్టర్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాతో చాన్నాళ్ల తర్వాత ఓ విజయాన్ని అందుకున్న అనుష్క.. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రెడీ అయింది. విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్యే మొదలైన సంగతి తెలిసిందే.
ఐతే ఇంకా అధికారిక ప్రకటన రాని సినిమా గురించి ముంబయిలో జరిగిన అమేజాన్ ప్రైమ్ మీట్‌లో ఓ విశేషం పంచుకున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ప్రి లుక్‌ను కూడా ఇక్కడ లాంచ్ చేశారు. ఘాటి అనే వెరైటీ టైటిల్ పెట్టారీ సినిమాకు. యువి క్రియేషన్స్‌తో కలిసి క్రిష్‌కు చెందిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అని సమాచారం. థయేట్రికల్ రిలీజ్ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం వెల్లడైంది.
ప్రి లుక్ పోస్టర్ చూస్తే ఇదేదో ప్రయోగాత్మకంగా, ఒక కాజ్ కోసం సాగే సినిమాలాగా కనిపిస్తోంది. అనుష్కను డీగ్లామరస్ రోల్‌లో చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో అనుష్క ముందు బాధితురాలై.. ఆ తర్వాత క్రిమినల్‌గా మారే పాత్ర చేస్తున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు సినిమాకు బ్రేక్ పడడంతో ఆ ఖాళీలో ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడు క్రిష్. ఈ ఏడాదే ఈ మూవీ విడుదల కానుంది.
This post was last modified on March 20, 2024 7:04 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…