దేవుళ్లు, మతాల విషయంలో మాట్లాడేటపుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అసలే ఇది సోషల్ మీడియా కాలం. చిన్న మాట తూలినా.. వివాదం అయిపోతుంది. కోట్లమంది మనోభావాలు తినేస్తాయి. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిపోతుంది. తాజాగా తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ చిన్న మాట తూలి వివాదంలో చిక్కుకున్నాడు.
ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మద్యం గురించి అతను మాట్లాడాడు. ఇందులో మహిళలు, పురుషులు అని తేడాలు చూడకూడదన్నాడు. మద్యం సేవించడం అన్నది అన్ని జాతుల్లో సర్వసాధారణమైన విషయమని పేర్కొన్నాడు. పురాతన కాలం నుంచి మద్యం సేవించడం ఉందని.. గతంలో సారా పేరుతో దాన్ని తాగేవారని.. ఆ తర్వాత బడా బడా కంపెనీలు రంగప్రవేశం చేసి రకరకాల బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతున్నాయని పేర్కొన్నాడు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ.. పురాతన కాలంలోనూ మద్యం తాగడం సాధారణమే అని చెబుతూ ఉదాహరణగా ఏసు క్రీస్తు కూడా ద్రాక్ష రసం తాగేవాడని పేర్కొన్నాడు. ఇది క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీసింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళనాడు క్రైస్తవ సంఘం ప్రకటన విడుదల చేసింది.
క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తీసిన విజయ్ ఆంటోనీ క్షమాపణ చెప్పకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. దీంతో విజయ్ ఆంటోనీ వెంటనే ప్రకటన విడుదల చేశాడు. తన వ్యాఖ్యల పట్ల క్రైస్తవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ద్రాక్ష రసం తాగడం రెండు వేల ఏళ్ల కిందటే ఉందని.. దేవాలయాలు, చర్చీల్లో కూడా దాన్ని వాడేవారని చెప్పానని.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని అతను ఈ ప్రకటనలో కోరాడు.
This post was last modified on March 19, 2024 10:12 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…