ఇటీవలే ప్రేమలు డిస్ట్రిబ్యూషన్ తో అటు మార్కెటింగ్ ఇటు బిజినెస్ రెండింట్లోనూ సక్సెస్ సాధించిన ఎస్ఎస్ కార్తికేయ ప్రొడక్షన్ పరంగానూ మంచి అడుగులు వేస్తున్నాడు. రాజమౌళి ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంతో పాటు వీటిని సమాంతరంగా నడిపించబోతున్నాడు. అందులో భాగంగా మలయాళం హీరో ఫహద్ ఫాసిల్ తో ఒకటి కాదు ఏకంగా రెండు భారీ చిత్రాల డీల్ కుదుర్చుకున్నాడు. ఆర్కా మీడియా శోభు యార్లగడ్డతో కలిసి వీటి నిర్మాణాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించాడు. ఒకటి ఈ ఏడాది, మరొకటి 2025లో రిలీజ్ కాబోతున్నాయి.
వీటి వెనుక ఉన్న సంగతులేంటో చూద్దాం. మొదటిది ఆక్సిజన్. సిద్దార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఇతనికిది డెబ్యూ. సైరా నరసింహారెడ్డికి ఏడిగా పనిచేయడంతో పాటు నటుడిగానూ చేశాడు. సత్యదేవ్ 47 డేస్ లోనూ ఉన్నాడు. ఒక నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని సీరియస్ ఇష్యూ మీద ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. వాయు కాలుష్యంని హైలైట్ చేసేలా ఉన్నారు. రెండోది డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇది ఎంటర్ టైనర్. దర్శకుడు శశాంక్ యేలేటి. మన ముగ్గురి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ తో గతంలో లాంచ్ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దగ్గర శిష్యరికం అనుభవం నేర్పింది.
ఈ ఇద్దరు కార్తికేయతో గత కొంత కాలంగా స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారు. కథలు చెప్పిన కొంతసేపటికి రెండూ చేయడానికి ఫహద్ ఫాసిల్ ఒప్పుకోవడం పట్ల కార్తికేయ చాలా హ్యాపీగా ఉన్నాడు. సరైన టాలెంట్ ని పసిగట్టడం పెద్ద టాస్క్ గా మారిపోయిన పరిస్థితుల్లో ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం. క్రియేటివ్ కాన్సెప్ట్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఋజువవుతూనే ఉన్నా కథల ఎంపికలో వేసే తప్పటడుగుల వల్ల కొందరు డెబ్యూతోనే మాయమైపోతున్నారు. టైటిల్స్ చూస్తుంటే కార్తికేయ టీమ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి ఎలా ఉండబోతున్నాయో.
This post was last modified on March 19, 2024 7:43 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…