ప్రపంచమంతా మెచ్చుకున్న బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లవుతున్నా దానికి సంబంధించిన విశేషాలు, చర్చలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ లో ప్రీమియర్ కు ప్రత్యేకంగా హాజరైన దర్శక ధీర రాజమౌళి కొన్ని షాకింగ్ అనిపించే సంగతులు పంచుకున్నారు. కొమరం భీమ్, జెన్నీ జంటకు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని రాసుకుని తర్వాత ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని, కొంత భాగం స్క్రిప్ట్ లోనే కోతకు గురయ్యిందని, నిడివి నుంచి వచ్చిన సమస్య వల్ల డైరెక్టర్ గా ఇష్టం లేకపోయినా ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
జక్కన్న చెప్పిన దాని ప్రకారం జెన్నీ జైల్లో ఉన్న భీమ్ కు సహాయం చేసేందుకు స్వంత బంగాళాలోనే ప్లాన్ పత్రాలు దొంగతనం చేశాక అతనికి స్వయంగా అందించే ఎపిసోడ్ కాస్త లెన్త్ తో ఉంటుందట. బురద నిండిన బూట్లతో వచ్చిన ఆమెను చూసి ఒకరు అనుమానంతో చూడగా అప్పుడు అసలు నిజం బయట పడుతుంది. భీమ్ ని అప్పగించమనే క్రమంలో జరిగిన సంఘర్షణలో తుపాకీ గుళ్ల వల్ల జెన్నీ స్వంతవాళ్ల చేతిలోనే ప్రాణాలు కోల్పోతుంది. ఇది ట్రాజెడీ అవుతుంది కాబట్టి అది ఇష్టం లేక తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి చెప్పడం అక్కడున్న వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీన్ని బట్టి రామరాజు, సీత తరహాలోనే రాజమౌళి భీమ్, జెన్నీలకు ట్రాక్ రాసుకున్నారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చిందన్న మాట. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక రెండు భాగాలు అయ్యుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు కానీ ఒక్క పార్ట్ కే పరిమితం చేయాలని నిర్ణయించుకోవడంతో మూడు గంటల నాలుగు నిమిషాలకు పరిమితం చేయాల్సి వచ్చింది. ఇదంతా సరే కానీ ఎడిటింగ్ లో ఇలా పక్కకెళ్ళిపోయిన ఫుటేజ్ ని ప్రత్యేకంగా ఆన్ లైన్ లో రిలీజ్ చేయమని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి వాళ్ళ కోరికను మన్నిస్తారేమో చూడాలి.
This post was last modified on March 19, 2024 11:40 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…