మాములుగా స్టార్ల సినిమా క్లైమాక్స్ లు చాలా భారీగా ఉంటాయి. విలన్ డెన్ను, ఫైట్లు, సవాళ్లు విసురుకుంటూ చెప్పే డైలాగులు అబ్బో వ్యవహారం మాములుగా ఉండదు. అలాంటిది హీరోతో ఒక్క డైలాగు చెప్పించకుండా, కేవలం హీరోయిన్ తో మాట్లాడించి చివర్లో అసలు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా తీస్తే ఎలా ఉంటుంది. అబ్బే అసలు ఆడదనుకుంటాం కదా. కానీ ఈ థియరీని పూర్తిగా మార్చి నిరూపించిన సినిమా రాజా. పాతికేళ్ల క్రితం1999 ఇదే మార్చి 18న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న రాజా వెనుక ఉన్న ప్రత్యేకమైన విశేషాలేంటో చూద్దాం.
1998 తమిళంలో కార్తీక్, రోజా జంటగా విక్రమన్ దర్శకత్వంలో ఉన్నైడతిల్ ఎన్నై కొడుతేన్ వచ్చింది. ఊహించని స్థాయిలో గొప్ప విజయం సాధించింది. నాన్ స్టాప్ గా 250 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. దీన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో ఆర్బి చౌదరి హక్కులు కొని వెంకటేష్, సౌందర్య తో ముప్పలనేని డైరెక్షన్ లో రూపొందించారు. మాస్ నుంచి ఫ్యామిలీస్ కి షిఫ్ట్ అయ్యే క్రమంలో దీన్ని ఎంచుకోవడం వెంకటేష్ ఆలోచనధోరణిని మార్చేసింది. ఒక అమ్మాయి జీవితంలో పైకి రావడం కోసం ఎంతో త్యాగం చేసి కష్టపడే పాత్రలో వెంకీ నటన క్లాసు మాసు తేడా లేకుండా కట్టిపడేసింది.
దెబ్బకు మాస్ చిత్రాల రేంజ్ లో రాజాకు కనకవర్షం కురిసింది. సెంటిమెంటుకి మగాళ్లు కూడా కదిలిపోయారు. ప్రారంభంలో కాసేపు దొంగగా కనిపించి ఆ తర్వాత పూర్తి సాత్వికంగా మారిపోయి సౌందర్యను గొప్ప స్థాయికి తీసుకెళ్లే క్యారెక్టర్ లో వెంకటేష్ జీవించాడు. సౌందర్యతో పాటు ఇతర ఆర్టిస్టులు ప్రాణం పోయడం ఒరిజినల్ వెర్షన్ కన్నా మిన్నగా రాజాని తీర్చిదిద్దింది. ఎస్ఎ రాజ్ కుమార్ స్వరపరిచిన పాటలు ఊరు వాడా మ్రోగిపోయాయి. 71 కేంద్రాల్లో శతదినోత్సవం, 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న రాజాకు ఇవాళ సిల్వర్ జూబ్లీ ఇయర్. రీమేక్ అయినా ఎమోషన్ సరిగ్గా పండితే ఏమవుతుందో రాజానే ఉదాహరణ.
This post was last modified on March 18, 2024 4:20 pm
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…