ఈ వారం మార్చి 22 విడుదల కాబోతున్న సినిమాల్లో ఓం భీమ్ బుష్ ఒకటే చెప్పుకోదగినది. యువి క్రియేషన్స్ బ్యాకప్ ఉండటంతో మంచి రిలీజ్ ప్లాన్ చేశారు. హీరో శ్రీవిష్ణుతో పాటు ప్రధాన పాత్రలు పోషించిన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తున్నారు. వెరైటీ కాన్సెప్ట్స్ తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో హారర్, సస్పెన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు రిలీజవుతున్న లైన్ మ్యాన్, హద్దులేదురా, కలియుగ పట్టణంలో లాంటి చిన్న చిత్రాలకు ఏమంత బజ్ లేదు.
ఇదంతా ఓకే కానీ నిజానికి అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు కూడా ముందు ఇదే డేట్ కు ప్లాన్ చేసుకున్నారు. మార్చి మొదటివారంలో పోస్టర్లు కూడా వచ్చాయి. కానీ ట్రైలర్ లాంచ్ నుంచి సీన్ మారిపోయింది. తప్పకోకుండానే తప్పుకున్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఓం భీమ్ బుష్ తో పోటీ వద్దనుకుని డ్రాప్ అయ్యిందా లేక ప్రమోషన్లకు టైం సరిపోలేదా, కారణం ఏదైతేనేం ఆ ఒక్కటి అడక్కుకి ఆప్షన్లు క్లిష్టమవుతున్నాయి. మార్చి 29 టిల్లు స్క్వేర్ రావడం పక్కా. దీని క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో భారీ ఎత్తున ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు.
ఈ లెక్కన శ్రీవిష్ణుతో కాంపిటీషన్ కన్నా సిద్దు జొన్నలగడ్డతో ఫేస్ టు ఫేస్ ఇంకా రిస్క్ అవుతుంది. ఒకవేళ ఏప్రిల్ 5 అనుకుంటే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కాచుకుని ఉన్నాడు. తండ్రి ఈవీవీ క్లాసిక్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న అల్లరి నరేష్ ఈసారి తన బలమైన జానర్ కి తిరిగి వస్తున్నానన్న నమ్మకంతో ఉన్నాడు. అలాంటప్పుడు వీలైనంత సేఫ్ గేమ్ అవసరం. అసలే బాక్సాఫీస్ దగ్గర ఫిబ్రవరి నుంచి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి టైంలో ఓం భీమ్ బుష్ తో పాటే వచ్చినా కూడా ఇబ్బంది ఉండేది కాదు కానీ డ్రాప్ కావడం తీవ్ర ఆలోచనలో పడేసింది.
This post was last modified on March 18, 2024 2:28 pm
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…