హీరోలు కండలు పెంచి కనిపించడం, సిక్స్‌ప్యాక్‌లు చేయడం ముందుగా బాలీవుడ్లో మొదలైన ట్రెండ్. దాన్ని సౌత్ హీరోలు కొంచెం లేటుగా అందిపుచ్చుకున్నారు. అప్పట్లో అల్లు అర్జున్ ‘దేశముదురు’ కోసం సిక్స్ ప్యాక్ చేస్తే అదో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అది ట్రెండుగా మారింది.
యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాల్లో హీరోగా ఫిట్‌గా కనిపించాల్సిన అవసరం పడితే.. హీరోలు చాలా కష్టపడి అవతారం మార్చుకుంటున్నారు. రామ్ చరణ్ లాంటి హీరోలు కళ్లు చెదిరే రీతిలో బాడీలను బిల్డ్ చేశారు. ఐతే ఇప్పటిదాకా సౌత్ హీరోలందరి చిజిల్డ్ బాడీ లుక్స్ ఒకెత్తయితే.. ఇప్పుడు తమిళ హీరో ఆర్య కొత్త లుక్ మరో ఎత్తు. అతను ‘మిస్టర్ ఎక్స్’ అనే సినిమా కోసం బాడీని పెంచిన తీరు చూస్తే షాకవ్వక మానరు.
తెలుగులో కూడా విడుదలైన ‘ఎఫ్ఐఆర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించిన మను ఆనంద్ డైరెక్షన్లో ఆర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం గత ఏడాది ఏప్రిల్లో అతను అవతారం మార్చుకోవడం మొదులపెట్టాడు. వర్కౌట్ మొదలుపెట్టడానికి ముందు తాను ఎలా ఉన్నానో ఒక ఫొటో పెట్టి.. ఆ తర్వాత ఎలాంటి లుక్‌లోకి వచ్చానో చూపిస్తూ అతను ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటోలు ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాదే పూర్తయిందని.. సినిమాలో పాత్ర పరిణామ క్రమానికి తగ్గట్లు అవతారం మార్చుకున్నానని.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ నడుస్తోందని అతను వెల్లడించాడు.
ఆర్య లుక్స్ చూసి ఒక క్యారెక్టర్ కోసం హీరో ఇంతగా కష్టపడతాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. తన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆర్య తెలుగులో ‘వరుడు’, ‘సైజ్ జీరో, ‘సైంధవ్’ లాంటి చిత్రాల్లో నటించాడు.
This post was last modified on March 18, 2024 1:59 pm
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…