ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ను ప్రకటించినప్పటికీ అది వార్తల్లో నిలుస్తోంది. దీని బడ్జెట్, కాస్టింగ్, టెక్నీషియన్ల గురించి అనేక రకాల వార్తలొస్తున్నాయి. ఇండియాలో అత్యధికంగా రూ.500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కనున్న చిత్రంగా ‘ఆదిపురుష్’ను చెబుతున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనుండగా.. అతడిని ఢీకొట్టే రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ సరసన సీతగా కనిపించే నటి ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందు ఈ పాత్రకు కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఐతే బాలీవుడ్ నటి అయితేనే ఈ సినిమాకు కలిసొస్తుందన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది.
ఐతే ‘లస్ట్ స్టోరీస్’ లాంటి ఎరోటిక్ వెబ్ సిరీస్‌లో నటించిన కియారాను సీతగా చూపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తింది. ఈలోపు సీతగా కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మదే ఆ పేరు కావడం విశేషం. బాలీవుడ్ మీడియాలో సీతగా అనుష్క అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుండటం విశేషం.
ఐతే ప్రస్తుతం అనుష్క గర్భవతి అనే విషయం మరిచిపోతున్నారు. 2021 తొలి నెలలో ఆమెకు ప్రసవం జరగబోతోంది. ఆ సమయానికి ‘ఆది పురుష్’ చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారు. వచ్చే ఏడాదే సినిమా కూడా పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ప్రసవం తర్వాత కొన్ని నెలల్లోనే చిత్రీకరణకు హాజరవ్వాలని అనుష్క అనుకుంటుందా.. కోహ్లి అందుకు అనుమతిస్తాడా అన్నది సందేహం.
అనుష్క ఇప్పటికే సినిమాలు తగ్గించేసింది. ఆమెను బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సంప్రదించడం మానేశారు. అలాంటిది గర్భవతిగా ఉన్న ఆమెను ‘ఆదిపురుష్’ టీం ఎందుకు సంప్రదిస్తుంది? ఇంత చిన్న లాజిక్ పట్టించుకోకుండా సీతగా అనుష్క అంటూ ఎలా ప్రచారం చేస్తున్నారో?
This post was last modified on September 12, 2020 7:33 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…