Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “సేవ్ ది టైగర్స్ – 2”

ఓటీటీ లో ఒక సిరీస్ హిట్ కొట్టిందంటే, వెంటనే ప్రేక్షకులు ఎదురుచూసేది – దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని. దానితోనే కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. ఫస్ట్ పార్ట్ తో సమానంగా ఉంటుందా? దాంట్లో ఉన్నట్టు కామెడీ ఉంటుందా? అందులో వున్న పాత్రలు యధాతధంగా ఉంటాయా? కొత్తవి ఏవైనా వచ్చి చేరతాయా? .. ఇలాంటివే ఎన్నో. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సూపర్ హిట్ సిరీస్ ” సేవ్ ది టైగర్స్” ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 100 శాతం సమాధానంగా సెకండ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సేవ్ ది టైగర్స్.. హాస్యానికి వ్యంగ్యాన్ని జోడించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించిన వెబ్ సిరీస్. ఇప్పుడు సెకండ్ సీజన్ ” సేవ్ ది టైగర్స్-2″ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ సిరీస్ క్రియేటర్స్. అరుణ్ కొత్తపల్లి దర్శకుడు. వెండితెరపై మెరుస్తున్న వేణు, ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, గంగవ్వ, శీరత్ కపూర్, సత్య కృష్ణన్.. ఇంకా ఎందరో ఆర్టిస్టులు సందడి చేస్తున్నారు.

పెళ్లి పరిణామాలు, వాటిని ఎదుర్కొనేందుకు సన్నాహాలు, చర్చలు అన్నీ కలిసి ఈ సిరీస్ ని మరింత ఎంగేజింగ్ గా ఎంటర్ టైనింగ్ గా అందించాయి. పరిచయమైన కొత్త పాత్రలు కథకి ఓ కొత్త డైమెన్షన్ ని ఇచ్చాయి. స్టోరీ టెల్లింగ్ లో ఒక కొత్త పంథా “సేవ్ ది టైగర్స్” సిరీస్ కి ఒక కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. దాన్నే ఇంకా బెటర్ గా..  డ్రామా, హాస్యం, గుండెని పిండేసే సన్నివేశాలు ఈ సీక్వెల్ కి సరికొత్త ఫ్లేవర్ ని అందించి, ప్రేక్షకుల్లో కొత్త డిస్కషన్ కి తెర తీసింది.

మొగుడు పెళ్ళాల మధ్య మొదలయ్యే గుసగుసల దగ్గర నుంచి రుసరుసల వరకు, చిన్న గొడవల నుంచి చినికి చినికి గాలివాన అయ్యే విరసాల వరకు ఎన్నో సంఘటనల సమాహారంగా ఈ సెకండ్ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.

ఇది బేసిక్ గా మూడు జంటల కథ. కానీ ఎక్కడో ఒక చోట, ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల ప్రతి జంటని టచ్ చేసే కథ. మన ఎదురింట్లోనో మన పక్కింట్లోనే.. కొన్నిసార్లు మనింట్లోనో జరుగుతున్నంత సహజంగా అనిపించడం “సేవ్ ది టైగర్స్ 2” ప్రత్యేకత. డోంట్ మిస్.

“సేవ్ ది టైగర్స్ 2” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3TgzBP3

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on March 17, 2024 9:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

4 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

5 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

6 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

6 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

8 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

8 hours ago