చూస్తుంటే రోజులు కర్పూరంలా కరిగిపోతున్నాయి కానీ టిల్లు స్క్వేర్ ప్రమోషన్లు మాత్రం ఇంకా మొదలుకాలేదు. మార్చి 29 కేవలం పదమూడు రోజుల దూరంలో ఉంది. టీమ్ ఇంకా చివరి నిమిషం ప్యాచప్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో హీరోతో సహా ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రేపటితో అది పూర్తవుతుందని అంటున్నారు కానీ ఆ వెంటనే బ్యాలన్స్ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆఘమేఘాల మీద చేయాల్సి ఉంటుంది. పైగా సెన్సార్ ఫార్మాలిటీని త్వరగా పూర్తి చేసుకోవాలి. దర్శకుడు మల్లిక్ రామ్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ ఇదంతా స్వయంగా చూసుకుంటున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ ని టిల్లు స్క్వేర్ వదులుకోకూడదు. ఎందుకంటే సుమారు నలభై రోజులకు పైగా బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ ని సరిగ్గా వాడుకుంటే కలెక్షన్ల మోత మోగుతుంది. సరైన సినిమా రాలేదని ప్రేక్షకలు అధిక శాతం థియేటర్ల వైపు వెళ్లడమే మానేశారు. ఈ కారణంగానే డీసెంట్ టాక్ వచ్చినా ఊరి పేరు భైరవకోన, గామి, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటివి మొదటి వీకెండ్ దాటగానే బాగా నెమ్మదించాయి. హనుమాన్ సంక్రాంతి హడావిడి తర్వాత కూడా హౌస్ ఫుల్స్ నమోదు చేయడం మర్చిపోకూడదు. సో సరైన కంటెంట్ పడితే ఎండలు లెక్క చేయకుండా పబ్లిక్ పోటెత్తుతారు.
టిల్లు మర్చిపోకూడదని విషయం మరొకటి ఉంది. ఎలక్షన్ కమీషన్ ప్రకటన వచ్చేసింది కాబట్టి ఏప్రిల్ లో ఎన్నికల ఫీవర్ క్రమంగా పెరుగుతుంది. సినిమాల ప్రాధాన్యం తగ్గిపోతుంది. సో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మార్చి చివరి వారం నుంచి కనీసం ఏప్రిల్ రెండో వారం దాకా నాన్ స్టాప్ గా దులిపేయొచ్చు. మధ్యలో ఫామిలీ స్టార్ వచ్చినా ఇబ్బంది ఉండదు. అనుపమ పరమేశ్వరన్ హాట్ గ్లామర్ తో పాటు మరింత స్పైసిగా మారిన టిల్లు కంటెంట్ మీద యూత్ బోలెడు అంచనాలతో ఉన్నారు. వాటిలో సగం అందుకున్నా ఈజీగా సూపర్ హిట్ అందుకోవచ్చు. అందుకే టిల్లు సౌండ్ పెంచాలి.
This post was last modified on March 17, 2024 6:48 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…