సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక ఎప్పుడేం జరుగుతుందో ఏ మాత్రం ఊహించలేనిది. దీనికి తోడు.. కోట్లాది మంది మెదళ్లకు వచ్చే ఆలోచనలు అందరికి షేర్ కావటం.. అందులో విషయం ఏ మాత్రం ఉన్నా అదే పనిగా వైరల్ కావటం తెలిసిందే. ఈకారణంతో సెలబ్రిటీలు పలువురు అనూహ్యమైన పరిణామాల్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. తాజాగా కింగ్ నాగార్జునకు ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని చెబుతున్నారు.
బిగ్ బాస్ షోలో ఇప్పటివరకూ ఎప్పుడు లేని రీతిలో గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దావిడను షోలోకి తీసుకురావటం.. ఇంట్లోకి పంపటం లాంటి వినూత్న ప్రయత్నం చేశారు. ఊహించిన దానికి మించి గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేయటమే కాదు.. ఆమెకు దన్నుగా లక్షలాది మంది ఉన్నామంటున్నారు. ఈసారి సీజన్ లో రెండో రోజు నుంచే ఆర్మీని సొంతం చేసుకున్న ఎవరైనా ఉన్నారంటే మట్టి మనిషి గంగవ్వే.
గంగవ్వను ఉద్దేశించి పెద్దావిడగా నాగ్ వ్యవహరించటంపై సోషల్ మీడియాలో పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. నాగ్ కు 61 ఏళ్లు అని.. గంగవ్వకు 60 ఏళ్లు అని.. అలా చూసినప్పుడు నాగ్ తాత కాకుండా గంగవ్వ బామ్మ ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. వయసు మీద పడుతున్నా.. అంతకంతకూ తన అందంతో ఆకర్షణీయంగా కనిపించే నాగ్ కు తాజాగాతెర మీదకు వచ్చిన ‘వయసు’ రచ్చ ఇబ్బందిని కలిగించేదే.
ఏతావాతా చెప్పేదేమంటే.. మిగిలిన కంటెస్టెంట్లను ట్రీట్ చేసినట్లుగా గంగవ్వను ట్రీట్ చేస్తే నాగ్ కు ఇబ్బందే. ఎందుకంటే.. ఇకపై ఆమెను బామ్మగా నాగ్ నోట నుంచి మాట వస్తే జరిగే రచ్చ మామూలుగా ఉండదంటున్నారు. చూస్తుంటే.. గంగవ్వ విషయంలో నాగ్ మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on September 12, 2020 1:35 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…