సినిమా అనేది కళకు సంబందించిన విషయమే అయినా వ్యాపార కోణంలో తీయకపోతే సంతృప్తి మిగులుతుందేమో కానీ చేతులు కాలడం ఖాయం. జాగ్రత్తగా ప్రేక్షకులకు నచ్చేలా తీయకుండా విమర్శకుల ప్రశంసలు, అవార్డుల కోసం తీస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో సాక్ష్యంగా నిలుస్తున్నాడో డైరెక్టర్. ఆయన పేరు దేవశిష్ మఖీజా. గత ఏడాది మనోజ్ బాజ్ పాయ్ తో జొరం అనే మూవీ తీశాడు. బెస్ట్ మూవీ, స్టోరీ విభాగాల్లో రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు దక్కాయి. రివ్యూస్ గొప్పగా మెచ్చుకున్నాయి. జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రొడక్షన్ భారం ఈయనదే అధికం.
తీరా చూస్తే జొరం థియేటర్లలో ఘోరంగా ఫెయిలయ్యింది. టికెట్లు కొని చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడలేదు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, థ్రిల్లర్ టచ్ తో ఒక మంచి కాన్సెప్ట్ ని రూపొందించిన విధానం కనెక్ట్ కాలేదు. ఇదంతా దేవశిష్ ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఎంతగా అంటే అయిదు నెలల నుంచి ఇంటి అద్దె కట్టలేకపోతే ఓనర్ ఖాళీ చేయమని ఒత్తిడి చేసేంత. గతంలో ఇలాగే అజ్జి అనే కళాత్మకత చిత్రాన్ని కేవలం 1 కోటితో తీస్తే 15 లక్షలు మాత్రమే వచ్చాయి. అయినా సరే మనసు చంపుకోలేక దర్శకత్వం చేస్తూనే ఉండటం ఇక్కడిదాకా తీసుకొచ్చింది.
అలా అని దేవశిష్ ప్రతిభ చిన్నదేమీ కాదు. చక్కని ట్రాక్ రికార్డు ఉంది. బంటీ ఔర్ బబ్లీ, బ్లాక్ ఫ్రైడే లాంటి క్లాసిక్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. చిన్న పిల్లల సాహిత్యంలో బెస్ట్ సెల్లర్స్ గా నిలిచిన పుస్తకాలు రాశాడు. ప్రత్యేకంగా ఈయన షార్ట్ ఫిలింస్ చాలా గొప్ప ఫేమ్ ని తీసుకొచ్చాయి. నాలుగు పదుల వయసులో ఉన్న తనకు కనీసం సైకిల్ కొనుక్కునే డబ్బులు కూడా ఇప్పుడు లేవని వాపోతున్నాడు. 40కి పైగా ఫుల్ బౌండ్ స్క్రిప్టులు తనదగ్గర ఉన్నాయని ఎవరైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. అయినా ఇప్పటి జనరేషన్ లో మరీ ఆర్ట్ తరహా సినిమాలే తీస్తూ ఉంటే కష్టమేగా.
This post was last modified on March 16, 2024 10:55 am
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…