ప్రభాస్ దర్శకుడు నాగ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి షూటింగ్ ఆపకుండా చేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఇటలీలో డార్లింగ్, దిశాపటాని పాల్గొనగా ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీసుకుని వచ్చేశారు. తిరిగి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది. మే 9 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాత వైపు పదే పడే వక్కాణింపు వస్తున్నా ఇతర ప్రొడ్యూసర్లు మాత్రం ఏమైనా వాయిదా ఉంటుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సలార్ తప్పుకోవడం వల్ల ఏం జరిగిందో అందరం చూశాం.
ఇప్పుడూ అదే రిపీట్ కావొచ్చని కొందరి ఆశ. అలా వెయిట్ చేస్తున్న వాటిలో ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి, మీడియం బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ భారతీయుడు 2 అందుకే ఏ నిర్ణయం తీసుకోలేక వేచి చూసే ధోరణిలో ఉంది. సుధీర్ బాబు హరోం హర, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరిలు అవకాశం దొరికితే వాడుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ గంగం గణేశా లాంటి ఛోటా సినిమాలు సైతం దీని గురించే ఆలోచిస్తున్నాయి. మే ఎంతో దూరంలో లేదు. పైగా తొమ్మిదో తేదీ మంచి హాలిడే సీజన్. అందరూ హ్యాపీగా సెలవుల్లో ఉండే క్రేజీ సమయం.
సో ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం కానీ రాబోయే రోజుల్లో పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మే 9 కల్కి రావడం పక్కానే. కానీ యూనిట్ టాక్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్వింగ్ లో ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నాగ అశ్విన్ రాజీ పడే సమస్యే లేదని చెబుతున్నాడట. తాను కోరుకున్న క్వాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తే తప్ప ఫైనల్ కాపీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనని అంటున్నాడని వినికిడి. మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సెంటిమెంట్ డేట్ వదలకూడదనేది నిర్మాత అశ్విన్ దత్ కోరిక. చూడాలి మరి.
This post was last modified on March 16, 2024 12:41 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…