samantha
సినిమా స్టార్లు ఎవరికైనా పెద్ద అనారోగ్య సమస్య ఉందని తెలిస్తే దాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. అది అభిమానులను బాధిస్తుంది. దీనికి తోడు కెరీర్ల మీదా ప్రభావం చూపుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకాక కొంత కాలం ఆ విషయాన్ని దాచిపెట్టింది.
కానీ చివరికి ఆమె దీని గురించి ఓపెన్ అయిపోయింది. అందుకు తాను నటించిన యశోద మూవీనే కారణం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సామ్. ముందు ఈ విషయాన్ని బయటపెట్టాలని అనుకోలేదని.. కానీ యశోద మూవీకి నష్టం జరుగుతోందని భావించి ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందని సామ్ తెలిపింది.
ఆ టైంలో తన గురించి రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయని.. సినిమాకు ప్రమోషన్ లేకపోవడం వల్ల చచ్చిపోయే పరిస్థితి ఉందని నిర్మాత ఆవేదన చెందడంతో తాను బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని.. అప్పుడే తనకు మయోసైటిస్ సోకిన విషయాన్ని వెల్లడించానని సమంత చెప్పింది. ఇక తన కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు కూడా తాను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయినట్లు సమంత వెల్లడించింది.
తాను అప్పట్లో ఇంపోస్టర్ డిజార్డర్‌తో ఇబ్బంది పడ్డానని.. తాను సాధించిన సక్సెస్‌లో తన ప్రమేయం లేదని.. ఈ సక్సెస్ ఎక్కువ కాలం ఉండదని అనిపించేదని.. అందువల్ల జీవితంలో అత్యంత ఆనందకర క్షణాలను కూడా ఆస్వాదించలేకపోయానని సామ్ చెప్పింది. తాను ఒక టైంలో ఎంతో శ్రమించానని.. రోజుకు ఐదు గంటలే పడుకునేదాన్నని.. తీరిక లేకుండా సినిమాలు చేయడంతో పాటు ఎన్నో రకాల పనులు చేసేదాన్నని.. అలా కష్టపడి ఒక స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పింది.
This post was last modified on March 16, 2024 7:22 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…