Movie News

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో ఆల్ టైం రికార్డ్

ఆ సినిమాలో స్టార్ న‌టీన‌టులు లేరు. ద‌ర్శ‌కుడు కూడా అంత పేరున్న వాడు కాదు. సినిమా బ‌డ్జెట్ కూడా చాలా త‌క్కువ. రిలీజ‌య్యే టైంకి అదొక చిన్న సినిమా. కానీ విడుద‌ల త‌ర్వాత దాని రేంజే మారిపోయింది. భారీ చిత్రాల‌ను మించి వ‌సూళ్ల మోత మోగిస్తూ.. వారాలు గ‌డుస్తున్నా హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతూ.. వేరే రాష్ట్రంలో సైతం సంచ‌ల‌న క‌లెక్ష‌న్లు సాధిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

ఇప్పుడా చిన్న సినిమా ఆ ఇండ‌స్ట్రీలోనే ఆల్ టైం రికార్డును న‌మోదు చేసింది. మ‌ల‌యాళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆ చిత్ర‌మే.. మంజుమ్మెల్ బాయ్స్‌. విడుద‌లైన తొలి రోజు నుంచి సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తూ అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ సాగిన ఈ మూవీ.. ఇప్పుడు మ‌ల‌యాళంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

గ‌త ఏడాది వేస‌విలో విడుద‌లై రూ.180 కోట్ల వ‌సూళ్ల‌తో మ‌ల‌యాళంలో ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన 2018 సినిమాను మంజుమ్మెల్ బాయ్స్ అధిగ‌మించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ సినిమా వ‌సూళ్లు రూ.190 కోట్ల‌కు చేరువ‌గా ఉన్నాయి. త్వ‌ర‌లోనే 200 కోట్ల మార్కును కూడా దాటేయ‌బోతోందీ చిత్రం. త‌మిళ‌నాట అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మ‌ల‌యాళ చిత్రంగా ఈ సినిమా రికార్డు నెల‌కొల్పింది.

విదేశాల్లో కూడా మాలీవుడ్ రికార్డు బ‌ద్ద‌లైంది. కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం.. కోడైకెనాల్‌ ట్రిప్ వేసింది. అప్పుడు ఆ గ్రూప్‌లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు. అతణ్ని అక్కడి నుంచి బయటికి తేవడానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సినిమాను తీర్చిదిద్దడంతో ప్రేక్షకులకు మాంచి థ్రిల్ ఇస్తోంది. 

This post was last modified on March 16, 2024 7:22 am

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

1 hour ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

1 hour ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

2 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

2 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

3 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

5 hours ago