రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీకి పెద్ది టైటిల్ ఖరారైనట్టుగా వచ్చిన వార్త చక్కర్లు కొడుతోంది. నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి కొట్టిపారేయడానికి లేదు. వచ్చే వారం మార్చి 20న ఓపెనింగ్ చేయబోతున్న దృష్ట్యా ఈ న్యూస్ లీక్ కావడం చూస్తే నిజమనుకోవడానికే ఎక్కువ స్కోప్ ఉంది. అయితే ఇది గతంలో జూనియర్ ఎన్టీఆర్ కోసం తయారు చేసుకున్న కథని, తారక్ చేయాలని ఉన్నా డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉండటంతో దాన్ని స్నేహితుడైన చరణ్ దగ్గరకు పంపించినట్టు టాక్ ఉంది కానీ వాస్తవమేంటో బుచ్చిబాబుకే తెలుసు.
దీని గురించి ఇద్దరి అభిమానులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. పెద్ది నిజంగానే తారక్ నుంచి చరణ్ కు వచ్చినా షాక్ అవ్వడానికి లేదు. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో ఎందరో హీరోలు బ్లాక్ బస్టర్ కథలను వేర్వేరు కారణాల వల్ల వదులుకున్నారు. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్ర రాకపోయి ఉంటే అతడులో పవన్ కళ్యాణ్ ఉండేవాడు. సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే ఇడియట్ రికార్డులు దక్కేవి. నువ్వే కావాలి వదులుకోవడం గురించి సుమంత్ ఇప్పటికీ చెబుతూ ఉంటాడు. ఇలా బోలెడు ఉదాహరణలు టాలీవుడ్ చరిత్రలో ఉన్నాయి.
ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఇది వేరే కథని చెప్పిన వీడియో క్లిప్ ని చరణ్ ఫ్యాన్స్ బయటికి తీశారు. పెద్ది ఎవరిదైనా ఆర్ఆర్ఆర్ హీరోల మధ్య వ్యక్తిగతంగా ఎంత బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ లో ఫ్యాన్స్ గొడవపడటం తప్పించి ఆ ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. కమిట్ మెంట్ల వల్ల సాధ్యపడదు కానీ ఆర్ఆర్ఆర్ 2 తీయాలనుకుంటే ఇద్దరూ సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి స్టోరీ ఎవరి నుంచి ఎవరికి వచ్చినా ఒరిగేది, నష్టపోయేది ఏమీ లేదు. కొంత ఆలస్యంగా అయినా సరే బుచ్చిబాబు ఏదో రోజు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వడం ఖాయం. వెయిట్ చేద్దాం.
This post was last modified on March 15, 2024 7:51 pm
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…