గామిని ఓ నలుగురు పెద్దమనుషులు చూసి రెండు ముక్కలు చెబితే బాగుంటుందని విశ్వక్ సేన్ అన్న మాటలు వైరల్ కావడం చూశాం. అయితే గతంలో వేరే ఈవెంట్ లో మాట్లాడుతూ నన్ను ఎవరూ లేపనవసరం లేదు, నన్ను నేనే లేచి గెలిచి చూపిస్తా అంటూ అన్న మాటల వీడియోని బయటికి తీసి కొందరు నెటిజెన్లు ఇప్పుడిలా అడగటం ఏమిటని ప్రశ్నించడం విశ్వక్ దృష్టికి వెళ్ళింది. దానికి సోషల్ మీడియాలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బ్రేక్ ఈవెన్ జరిగిపోయి లాభాలు వచ్చిన సినిమాను ప్రత్యేకంగా చూడమని ఇప్పుడు ఎందుకు అడుగుతానని పేర్కొన్నాడు.
తాను తప్ప టీమ్ లో అందరూ కొత్తవాళ్లే కాబట్టి గామిని చూసి వాళ్ళను ప్రోత్సహించేలా చెప్పమని అన్నాను తప్పించి ఇంకే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి విశ్వక్ సేన్ ఇక ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలేస్తే బెటర్. ప్రాక్టికల్ గా చూసుకుంటే గామి నిజంగానే బాగా స్లో అయిన మాట వాస్తవం. రెండో వారంలో బిసి సెంటర్స్ షోలు తగ్గించారు. కొత్త రిలీజులు ఎక్కువ ఉండటం కారణమే అయినా ఒకవేళ గామి పెద్ద బ్లాక్ బస్టర్ దిశగా వెళ్లుంటే షోలు, థియేటర్లను హోల్డ్ చేసే వాళ్ళు. కానీ అలా జరగలేదంటే వాస్తవంగా డిస్ట్రిబ్యూటర్లు జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకున్నారు కాబట్టి.
విశ్వక్ చెప్పినట్టు గామికి తెలుగు సినిమాలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో డౌట్ లేదు. దాన్ని మనం పదే పదే చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ అన్నారు. విమర్శకులు మెచ్చుకున్నారు. ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సంతోషం. కమర్షియల్ అంశాలు మచ్చుకు కూడా లేకుండా నెమ్మదిగా నడిచే ఒక స్పిరిచువల్ థ్రిల్లర్ ఇంత స్పందన తెచ్చుకోవడం టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని చాటేదే. మాస్ వర్గాలకు అంత సులభంగా చేరని ఇలాంటి ప్రయోగాలకు వసూళ్ల రూపంలో మద్దతు ఇచ్చారు కాబట్టి గామికి సపోర్ట్ లేదని చెప్పడానికి లేదు. సెలబ్రిటీలు ఏమి అనకపోయినా జనాలు మెచ్చారుగా.
This post was last modified on March 15, 2024 7:10 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్‌లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…