సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కొంచెం నెమ్మదించినట్టు కనిపించినా ప్రాజెక్టులను రాబట్టుకోవడంలో మాత్రం మాములు దూకుడుగా లేడు. కొంత కాలం తమన్ డామినేషన్ లో కొంచెం మెల్లగా అడుగులు వేసి మళ్ళీ పూర్తి ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సంగీత దర్శకుడి మీద పెట్టుకున్న నమ్మకం ఏ స్థాయిలో ఉందంటే క్రేజీ సినిమాలన్నీ తన చేతిలోనే పెడుతున్నారు. తాజాగా అజిత్ కుమార్ హీరోగా తమిళంలో ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందబోయే గుడ్ బ్యాడ్ అగ్లీకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవినే తీసుకోవడం దానికి నిదర్శనం.
దేవి మైత్రి బంధం బ్లాక్ బస్టర్ లాంటిది. పుష్ప 1 ది రైజ్, వాల్తేరు వీరయ్య, ఉప్పెన, చిత్రలహరి, రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు ఇవన్నీ ఈ కాంబోలో వచ్చిన మ్యూజికల్ సూపర్ హిట్స్. నిర్మాణంలో ఉన్న పుష్ప 2 ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్ లు దేవి ఖాతాలోనే ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన గుడ్ బ్యాడ్ ఆగ్లీ చేరింది. దేవికి తమిళ సినిమాలు కొత్తేమి కాదు కానీ అజిత్ తో చేయడమంటే ఒకరకంగా ప్రమోషన్ లాంటిది. సరైన పాటలు ఇస్తే ఊరువాడా మోగిపోతాయి. గత కొన్నేళ్లుగా అజిత్ కు మంచి సాంగ్స్ ఎవరూ ఇవ్వలేకపోయారు. ఏదో అలా లాకొచ్చారు.
ఈరకంగా చూస్తే రాకింగ్ స్టార్ స్పెషల్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో జరిగేలా ఉన్నాయి. సాయి దుర్గ తేజ్ చిత్రలహరి 2 క్యాన్సిలనే తరహాలో మాట్లాడుతున్నాడు కానీ స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. ఇది కన్ఫర్మ్ అయితే మైత్రి టీమ్ నుంచి ఇంకో సినిమా దేవికి వచ్చినట్టే. ఎందుకంటే మొదటి భాగానికి మ్యూజిక్ ఇచ్చింది తనే కాబట్టి. పుట్టినరోజు జరుపుకుని తాను దేవుడిలా కొలిచే ఇళయరాజాని స్టూడియోకి ఆహ్వానించి ఆ ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్న దేవికి ఇక్కడ చెప్పినవి కాకుండా బయట సంస్థల్లో చైతు తండేల్, ధనుష్ కుబేరలు ఉన్నాయి.
This post was last modified on March 14, 2024 7:23 pm
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…