సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీర రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని ఎదురు చూసిన అభిమానులకు ఒక శుభవార్త. ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 9న ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా జక్కన్న సృష్టించబోయే ప్రపంచం తాలూకు ముఖ్యమైన విషయాలను పంచుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణతో పాటు భాగస్వాములుగా ఉన్న జిఎంబి ఎంటర్ టైన్మెంట్స్ తరపున మహేష్, పార్ట్ నర్ కాబోతున్న నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు ఇందులో ఉంటారని తెలిసింది.
ఆర్ఆర్ఆర్ కు సైతం రాజమౌళి ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఇప్పుడూ కొనసాగించబోతున్నారు. టైటిల్ కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. మహారాజా, చక్రవర్తి పేర్లు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి కానీ టీమ్ వీటి గురించి మౌనంగా ఉంది. ముందు సంభాషణల రచయితగా ఉన్న సాయిమాధవ్ బుర్రా తప్పుకున్నారనే టాక్ నేపథ్యంలో కొత్తగా ఎవరు చేరారనే అంశం కూడా అదే రోజు ప్రకటించే అవకాశముంది. కీరవాణితో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పరిచయం మొత్తం అదే రోజు జరగనుంది. తెలుగువారి ఉగాది పర్వదినం కావడంతో ఇంత కన్నా మంచి డేట్ ఏముంటుంది.
ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీడియాకు ఆహ్వానాలు అందలేదు. ఘనంగా చేయబోయే ఈ మీట్ ని లైవ్ కెమెరాల ద్వారా కాకుండా ప్రత్యేకంగా తర్వాత స్ట్రీమింగ్ చేసే ఆలోచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం యాడ్స్ షూట్ లో బిజీగా ఉన్న మహేష్ త్వరలో అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఫోటోలు దిగబోతున్నాడు. కొంత కాలం అందుబాటులో ఉండడు కాబట్టి ఆ లోటు తెలియకుండా ఉండటం కోసం ఈ మీటింగన్న మాట. స్క్రిప్ట్ వర్క్ ఒక కొలిక్కి వచ్చిందట కానీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది కూడా ఆ రోజే వెల్లడించే ఛాన్స్ ఉంది. చూద్దాం.
This post was last modified on March 14, 2024 4:21 pm
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…