సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓటిటి ద్వారా విడుదల కానుందనే సంగతి విదితమే. జీ 5 ఈ చిత్రం డిజిటల్‍తో పాటు థియేట్రికల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. అక్టోబర్‍లో విడుదల చేసుకునేలా తమకు కంటెంట్ అప్పగించాలనే కండిషన్ పెట్టడంతో కరోనాని లెక్క చేయకుండా పరిమిత బృందంతో బ్యాలెన్స్ షూటింగ్ చేసేసారు.
అయితే రెండు పాటలు కూడా తీయాల్సి వుండగా, ఎలాగో ఓటిటి రిలీజ్ కాబట్టి ఇక వాటి అవసరం లేదని భావించి ఆ పాటల చిత్రీకరణ చేయలేదని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందనే సంగతి సాయి ధరమ్ తేజ్ అఫీషియల్‍గా ప్రకటించాడు. మాస్క్ లు వేసుకుని షూటింగ్ చేసినపుడు, వేసుకోకుండా చేసినపుడు కూడా చాలా ఎంజాయ్ చేశానని అన్నాడు. ఈ చిత్రం రిలీజ్ సంగతి మాత్రం ఈ టీమ్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.
జీ 5 నుంచి కూడా సోలో బ్రతుకే సో బెటర్ డిజిటల్ రిలీజ్ గురించిన ఇన్‍ఫర్మేషన్ లేదు. బహుశా మంచి రోజు చూసుకుని అధికారిక వార్తతో వద్దామని భావిస్తున్నారేమో. తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‍గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు, సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడు.
This post was last modified on September 12, 2020 10:51 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…