యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నానే కానీ.. ఆ సినిమా రిలీజ్ తర్వాత తక్కువ స్క్రీన్ టైంతోనే ఎక్కువగా జనాల దృష్టిలో పడింది మాత్రం త్రిప్తి దిమ్రినే. సినిమాలో ఆమె మహా అయితే ఓ 20 నిమిషాలు కనిపిస్తుందేమో. కానీ జోయా పాత్రలో ఆమె వేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా బలమైంది.
రష్మిక కీలక పాత్రలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినా సరే.. త్రిప్తి బాగా హైలైట్ అయింది. ఆమె అందానికి, తనతో రణబీర్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. యానిమల్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమెకు అవకాశాలకు కూడా లోటే లేదు. భూల్ భులయియా-2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంది త్రిప్తి.
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. త్రిప్తికి యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేసేటప్పటికి త్రిప్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు. కొత్తమ్మాయి.. పైగా తక్కువ నిడివి ఉన్న పాత్ర. కాబట్టి తక్కువ పారితోషకానికే ఒప్పుకుంది. కానీ యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్టయి త్రిప్తి పేరు మార్మోగేలా చేసింది.
ఇప్పుడు చూస్తే ఆమెకు తక్కువ పారితోషకం ఇచ్చారని అనిపిస్తుంది కానీ.. ఆ సినిమా వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతులతో త్రిప్తి కెరీరే మారిపోయింది. ఇప్పుడు భూల్ భులయియాలో చేస్తున్న స్పెషల్ రోల్‌కు ఆమె కోటి రూపాయలు పుచ్చుకుంటోందట. ఆ సినిమా కూడా బాగా ఆడితే త్రిప్తి పారితోషకం మల్టిప్లై కావడం ఖాయం. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 14, 2024 7:38 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…